త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల మూవీ ఫస్ట్ లుక్!

Is Jr NTR Regretting Mahanati Post-Release?‘జై లవకుశ’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సీమ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను యంగ్ టైగర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయబోతున్నారు.

ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా, దానికి ఒక రోజు ముందుగనే ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. దీంతో యంగ్ టైగర్ అభిమానుల చూపులన్నీ ప్రస్తుతం 19వ తేదీ వైపుకు మళ్ళాయి. మధ్యాహ్నం రెండు గంటల ఇరవై అయిదు నిముషాలకు తారక్ ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లుగా సమాచారం. టైటిల్ ప్రకటన ఇంకా చేయలేదు గనుక, బహుశా ఆ రోజున టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తారేమో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories