Telugu

కడిగిన ముత్యానికి రిమాండ్‌… తిహార్ జైలుకి తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో వారం రోజులుగా ఈడీ కస్టడీలో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితకి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు, ఏప్రిల్‌ 9 వరకు (రెండు వారాలు) జ్యూడిషియల్ రిమాండ్‌ విధించడంతో ఢిల్లీ పోలీసులు ఆమెను తిహార్ జైలుకి తరలించారు. ఏప్రిల్‌ 1న ఆమె బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు మళ్ళీ విచారణ చేపట్టనుంది

ADVERTISEMENT

ఆమె కుమారుడుకి త్వరలో పరీక్షలు ఉన్నందున ఏప్రిల్‌ ఏప్రిల్‌ 16వరకు మద్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోరారు. కానీ కోర్టు ఆమెను రిమాండ్‌ మీద జైలుకి పంపింది. తాను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని ఆమె ముందే పసిగట్టిన్నట్లున్నారు.

బహుశః అందుకే కోర్టు హాలులోకి ప్రవేశిస్తున్నప్పుడు, “ఇప్పుడు నన్ను జైలుకి పంపినా కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. జైల్లో పెట్టినా ఎవరూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు… పోలిటికల్ లాండరింగ్ కేసు.

ఈ కేసులో ఓ నిందితుడు బీజేపీలో చేరాడు. మరొక నిందితుడికి బీజేపీ టికెట్‌ కూడా ఇస్తోంది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు బాండ్ల చెల్లించుకుని బయటపడ్డారు. కానీ నేను కడ వరకు న్యాయపోరాటం చేసి, నా నిజాయితీ నిరూపించుకుంటాను.

ఈ కేసులో నేను అప్రూవరుగా మారే ప్రసక్తే లేదు,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె కోర్టు ఆవరణలో ‘జై తెలంగాణ… జై కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు.

నిజానికి ఈ కేసు, దాంతో ఎదురయ్యే ఇటువంటి సమస్యలతో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే సంబంధం. దీంతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి సంబందమూ లేదు. కానీ దీనిని తెలంగాణ ప్రజలందరి సమస్య అన్నట్లు బిఆర్ఎస్ పార్టీ, నేడు కల్వకుంట్ల కవిత కూడా చిత్రీకరించే ప్రయత్నం చేసిన్నట్లు భావించవచ్చు.

ఈ కేసుతో తనకు ఎటువంటి సంబందమూ లేదని వాదిస్తున్న కల్వకుంట్ల కవిత, ‘అప్రూవరు’గా మారనని చెప్పడం ద్వారా ఈ కేసుతో ఆమెకు ఖచ్చితంగా సంబందం ఉందని స్వయంగా బయట పెట్టుకొన్నట్లయింది.

అయినా ఈ కేసులో ఆమె అర్వింద్ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి వంద కోట్లు ముడుపులు చెల్లించి కీలకపాత్ర పోషించిన్నట్లు ఈడీ చెపుతుంటే, ఆమె అప్రూవరుగా ఎలా మారుతారు?ఒకవేళ ఇప్పుడు ఆమె, ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ కూడా రేపు అప్రూవరుగా మారితే ఇక దోషులు ఎవరు మిగులుతారు? కోర్టులు ఎవరిని శిక్షించాలి?

ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో మిగిలిన నిందితులందరూ అప్రూవర్లుగా మారడం వలననే ఆమె దీనిలో మరింత లోతుగా చిక్కుకు పోయారని చెప్పవచ్చు. ఈ కేసులో కేవలం మద్యం, అవినీతి, కుంభకోణం మాత్రమే కాదు… ఆమె చెప్పిన్నట్లు రాజకీయ కోణం కూడా ఉంది. వాటి గురించి అందరికీ తెలుసు కూడా.

కనుక ఈ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌ గడువులోగా కేసీఆర్‌ అండ్ కో కేంద్రంతో సంధి ప్రయత్నాలు చేసుకొని అవి ఫలిస్తే కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు చేతికి మట్టి అంట కుండా ఏవిదంగా ప్రతీకారం తీర్చుకున్నారో, ఇప్పుడు కల్వకుంట్ల కవిత బెయిల్‌ విషయంలో కూడా కేసీఆర్‌ మీద అదేవిదంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోర్టులు ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగిస్తూనే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆమె కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పినందుకు సంతోషించాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Confusion Turns Double Trouble for Venkatesh?

Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…

5 hours ago

H-4 EAD Update: USCIS Removes Automatic Extension

The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…

5 hours ago