
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పూర్తిగా విముక్తి లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై నేడు తుది తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నిటినీ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు ప్రకటించారు. ఈ కేసులో వారందరూ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ బలమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయిందన్నారు.
సీబీఐ ఛార్జ్ షీట్ కూడా లోపభూయిష్టంగా ఉందని న్యాయమూర్తి ఆక్షేపించారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే అందరి పేర్లు ఈ కేసులో ఇరికించారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో వారందరూ దోషులుగా నిరూపించడంలో సీబీఐ వైఫల్యం చెందిందని, కనుక ఈ కేసుని నీరుగార్చినందుకు సీబీఐ అధికారుల మీదే దర్యాప్తు జరపాలని న్యాయమూర్తి అన్నారు.
ఈ కేసులో ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, మాజీ సిఎం కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ కేసులని కొట్టివేస్తూ వారందరికీ ఈ కేసు నుంచి న్యాయస్థానం విముక్తి కల్పించింది.
ఈ కేసు విచారణకు మొదటిసారి నోటీస్ అందుకున్నప్పటి నుంచి కల్వకుంట్ల కవిత తాను నిరాపరాధినని, ఎటువంటి తప్పు, అవినీతికి పాల్పడలేదని చెపుతూనే ఉన్నారు.
తన తండ్రి కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే మోడీ ప్రభుత్వం ఈ భూటకపు కేసు సృష్టించి తనని అరెస్ట్ చేసిందని ఆరోపించేవారు. కానీ తాను కడిగిన ఆణిముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతానని పదేపదే చెప్పేవారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ఆణిముత్యంలా బయటపడ్డారు.
ఈ కేసు తదనంతర పరిణామాల కారణంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యి నానా అవమానాలు భరించాల్సి వస్తోంది. అయినా ఒంటరిగా పోరాటం చేస్తూ త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆమెకు ఈ కేసు నుంచి ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి విముక్తి కల్పించడంతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. నూతనోత్సాహంతో మరింత వేగంగా దూసుకుపోయేందుకు తోడ్పడుతుంది.
ఈ తీర్పుపై ఆమె ఏవిధంగా స్పందిస్తారో ఊహించవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో… అలాగే కాంగ్రెస్, బిజేపిల స్పందన కూడా చూడాలి.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…