
సహజంగానే కేఏ పాల్ చేష్టలు, హావభావాలు, ప్రకటనలు కామెడీకి పరాకాష్టగా ఉంటాయి. అలాంటిది.. కేఏ పాల్ ఎమోషనల్ అవుతూ.. నేను ప్రధాని అయ్యాక, పవనే సీఎం అంటూ చెప్పడం ఇంకాస్త కామెడీ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయిన పాల్ కొద్దికాలం ఎవరికి కనిపించలేదు. కాకపోతే, ఈ మధ్య అడపదడపా ఆందోళనలప్పుడు బయటకొచ్చి ఇలా కామెడీ చేస్తూ కాలాక్షేపం చేస్తున్నాడు.
లేటెస్ట్ గా విడుదల చేసిన వీడియోలో కేఏపాల్ ‘సీరియస్ కామెడీ’కి ఇప్పుడు జనాలు విరగబడి నవ్వుకుంటున్నారు. ఇంతకీ పాల్ ఏమి మాట్లాడాడు అంటే..‘చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను లవ్ చేస్తున్నాడట. తనను పవన్ ను కూడా లవ్ చేయమంటున్నాడు. కానీ చంద్రబాబుతో ఏం కాదు. అందుకే.. త్వరగా జనసేన నేతలు, కార్యకర్తలు అంతా ప్రజా శాంతి పార్టీలో జాయిన్ అయ్యిపోండి. నేను ప్రధానమంత్రి అయిన వెంటనే.. ఏపీకి పవన్ కళ్యాణ్ ను సీఎంను చేస్తాను’ అంటూ కేఏ పాల్ సీరియస్ ప్రతిపాదన పెట్టాడు.
అశేష అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ ను పాల్ సీఎంను చేస్తాడట. సరే.. తాను పీఎం అయిపోతాను అంటూ పాల్ మాట్లాడటం.. పాల్ మానసిక పరిస్థితిని తెలియజేస్తోంది. పాల్ వెనుక ఎవరో ఉన్నారు అంటూ ఇన్నాళ్లు ఒక వాదన వినిపించింది. పాల్ తాజా కామెంట్స్ విన్నాక, పాల వెనుక పాల్ కూడా లేదని అర్ధమవుతుంది. ఏది ఏమైనా పొలిటికల్ కమెడియన్ గా పాల్ కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
కేఏ పాల్ ఎంతో సీరియస్ గా చేసే హాస్య ప్రసంగాలకు, పాల్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏది ఏమైనా ఆగ్రహంతో ఊగిపోతూ జనాలను నవ్వించడం.. పైగా ఎవ్వరికీ అస్సలు అర్థం కాని క్యాండిడేట్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం ఒక్క కేఏపాల్ కు మాత్రమే సాధ్యమైంది. ఇక పాల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ.. ‘పాల్ గారూ మీకు ప్రధాన మంత్రి స్థాయి ఏమి సరిపోతుంది సర్ ? అంటూ తమ వెటకారాన్ని చాటుకుంటున్నారు.
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…