బాలీవుడ్ పై మోజు లేదన్న టాలీవుడ్ టాప్ బ్యూటీ!

kajal about bollywood chances“సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం” వంటి టాప్ హీరోల సరసన నటిస్తూ మళ్ళీ గత వైభవాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్న కలువకళ్ళ కాజల్ అటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలలో నటించింది. ‘సింగం, స్పెషల్ చబ్బీస్’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ, ఆశించిన రీతిలో కాజల్ కు ఎందుకు అవకాశాలు రాలేదా అన్న విషయంపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిని ప్రదర్శించాయి.

అయితే పరోక్షంగా దీనికి జవాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ అంటే తనకు మోజు లేదని, మంచి పాత్రలు వస్తేనే చేస్తానని, అది బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా… అంటూ చెప్పుకొచ్చింది. ఏదొక సినిమా చేయాలి కాబట్టి చేయాలంటే ప్రస్తుతం తాను ఉన్నటువంటి టాలీవుడ్ లోనే బోలెడు సినిమాలు ఉంటాయని, అయితే తనకు నచ్చని పాత్రలలో నటించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టింది.

ADVERTISEMENT

హీరోయిన్లు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చాలా సర్వసాధారణమేనని అవకాశాలు రావడం లేదని ఒప్పుకోకుండా ఉండడానికి ఇలాంటి మాటలతో కవర్ చేస్తుంటారని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు. నిజానికి కాజల్ చెప్పినట్లు… హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న ఎన్ని సినిమాలలో కాజల్ నటించిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం “దో లఫ్జోంకీ కహానీ” అనే హిందీ సినిమాలో నటిస్తూ ఈ సంగతులన్నీ చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories