చిరంజీవికి డబల్ ఛార్జ్ వేసిందట

Kajal -Aggarwal remuneration for chiranjeevi acharya-మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ గా మొదట్లో త్రిష ను అనుకున్నారు అయితే ఆమె చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చింది. పైగా ట్విట్టర్ ఎక్కి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే సినిమా నుండి తప్పుకుంటున్నా అని ప్రకటించింది.

ఇప్పుడు ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. ఈ మధ్య కాజల్ కు పెద్దగా సినిమాలు లేవు. చిన్న హీరోల సరసన కూడా నటిస్తుంది. ఆమెకు 70 లక్షల నుండి 80 లక్షల దాకా ముడుతుందట. అయితే చిరంజీవి సినిమా చేసేందుకు మాత్రం రెండున్నర కోట్లు అడిగిందట. మొత్తానికి కోటిన్నరకు ఒప్పుకుందని సమాచారం.

ADVERTISEMENT

అంటే చిరంజీవికి దాదాపుగా డబల్ ఛార్జ్ చేసింది ఈ అమ్మడు. గతంలో చిరంజీవి, కాజల్ అగర్వాల్ ఖైదీ నెంబర్ 150లో కలిసి నటించారు. కరోనా వైరస్ భయంతో ఇండస్ట్రీ లో షూటింగ్లు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం అయ్యాకా కాజల్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో చిరంజీవితో ఖైదీ నెంబర్ 150లో నటించింది.

రామ్ చరణ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మణి శర్మ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే మొదలయ్యింది. దాదాపుగా అన్ని ఏరియాలలో అల వైకుంఠపురములో సాధించిన కలెక్షన్స్ రేటుకు సినిమా రైట్స్ ని అమ్ముతున్నారట. కొరటాల శివకు ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. పైగా అతని ప్రతీ సినిమా ఆయా హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. ఈ పాయింట్ మీద ఆచార్య రైట్స్ భారీ రేట్లకు అమ్ముతున్నారట

ADVERTISEMENT
Latest Stories