కాజల్ పని అయిపోయినట్టేనా?

Kajal Aggarwal to romance with Allari Nareshఒకప్పుడు అందరు స్టార్ హీరోస్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ కి వయసుతో పాటు అవకాశాలు తగ్గాయి. అయితే ఏదో రకంగా కేరీర్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. మొన్న ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువహీరోలతో కూడా నటించడం మొదలుపెట్టింది. తాజాగా మరికాస్త పట్టుసడలించినట్టు సమాచారం.

ADVERTISEMENT

తాజాగా ఈ అమ్మడు అల్లరి నరేష్ సరసన జతకట్టాల్సిన సిట్యుయేషన్ లో పడింది. అల్లరి నరేష్ కామెడీ హీరో. అతని కెరీర్ బాలేదు. హీరో గా కంటిన్యూ చేసేందుకు… నానా తిప్పలు పడుతున్నాడు. మహర్షిలో క్యారెక్టర్ పాత్ర కూడా చేశాడు. కొరియాలో రూపొందిన “డ్యాన్సింగ్ క్వీన్” అనే మూవీని తెలుగులో రానా రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి కాజల్ ని ఫైనల్ అనుకున్నారట. అందుకే ఆమెని ఒప్పించారని సమాచారం. అయితే, ఆమెకి హీరోగా ఇప్పుడు అల్లరి నరేష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. కథ ప్రకారం కామెడీ చేసే హీరో అయితేనే బాగుంటుంది. దీనితో నరేష్ వైపు చూస్తున్నారు. నరేష్ సరసన ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నటించడం అంటే కాజల్ కి రిస్క్ అనే చెప్పుకోవాలి.

ఒక్కసారి ఆ సినిమా చేశాక వేరే హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే. ఒప్పుకుంటే కాళ్ళ దగ్గరకు వచ్చిన ఒక్క సినిమా కూడా పోతుంది.. చేస్తే ఇక సినిమాలు రావు. ఇప్పుడున్న సిట్యుయేషన్ లో కాజల్ ఒప్పుకునే ఛాన్స్ ఉంది. అని కొందరు అంటున్నారు. మరోవైపు ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ కి కూడా రెడీ అవుతుందట.

ADVERTISEMENT
Latest Stories