పేరు, పబ్లిసిటీ కోసం కాదు! ‘స్మార్ట్’ సౌకర్యాలు ఇవే!

kakinada smart cityకేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు పట్టణాలు విశాఖ, కాకినాడ ఎంపికైన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీ పేరిట ఎంపిక చేసిన ఈ నగరాలకు ఏర్పడనున్న సరికొత్త సౌకర్యాలు ఏమిటన్నది ప్రజలకు కాస్త అయోమయంగా ఉండడంతో, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సదరు సదుపాయాలను సవివరంగా తెలిపింది.

ADVERTISEMENT

విశాఖపట్టణంలో 10 వేల మందికి సరిపడా అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించనున్నారు. అలాగే నిరంతరాయ నీటి సరఫరాను ఏర్పాట్లు చేయనున్నారు. విశాఖను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వాటర్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేస్తారు. జీవీఎంసీ పరిధిలోని 1700 ఎకరాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన అమెరికా సాయంతో విశాఖను నలువైపులా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

ఇక, కాకినాడలో సరికొత్త సౌకర్యాల విషయాలకు వస్తే… స్మార్ట్ సిటీ కింద ప్రతి ఏటా 200 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు కేంద్రం అందజేయనుంది. 7 జోన్లుగా కాకినాడను విభజించి అభివృద్ధి చేపట్టనున్నారు. వివేకానంద పార్కులో గోదావరి కళాక్షేత్రం నిర్మించనున్నారు. పాత మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ లో బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. కుళాయి చెరువు వద్ద మల్టీప్లెక్స్ ధియేటర్లతో కూడిన వాణిజ్య సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖకు అమెరికా సాయం అందిస్తుండగా, కాకినాడను జపాన్ సాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

‘స్మార్ట్ సిటీ’ అన్నది కేవలం పేరు కోసం, పబ్లిసిటీ కోసమేనన్న భావన చాలా మందిలో ఉంది. బహుశా ఈ సందేహాలను నివృత్తి చేయడానికి తొలివిడతగా కేంద్రం చెప్పిన ఈ వివరాలు సరిపోతాయోమో..! ఇంకెందుకు ఆలస్యం… రాసుకో సాంబ..!

ADVERTISEMENT
Latest Stories