Telugu

తెలంగాణలో ఉన్నప్పుడు విమర్శలు… ఏపీకి వస్తే సుద్దులా?

బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయ మనుగడకు బలమైన విధానాన్ని అంటే నీళ్ళ పేరుతో రాజకీయాలు చేయడం, తెలంగాణ సెంటిమెంట్ వంటివి రూపొందించిన రూపకర్త ఆ పార్టీ అధినేత కేసీఆర్‌. అరటి చెట్టుకు పిలకలు వేసినట్లు బీఆర్ఎస్‌ చెట్టు నుంచి పుట్టిందే టీఆర్ఎస్‌ పార్టీ. పైగా ఆ పార్టీ స్థాపించింది ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితే. కనుక ఆమె కూడా ఇదే ఫార్ములాతో రాజకీయాలు చేస్తుండటంతో అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక ఆమె కూడా బీఆర్ఎస్‌ నేతలతో పోటీ పడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నీళ్ళు తరలించుకుపోతున్నారని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సహకరిస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత తరచూ విమర్శిస్తూనే ఉంటారు.

ADVERTISEMENT

హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆంధ్రా ప్రభుత్వం గురించి ఈవిధంగా మాట్లాడే ఆమె, ఆంధ్రాకి వచ్చినప్పుడు మాత్రం చాలా పద్దతిగా మాట్లాడుతారు.

తాజాగా రాజమహేంద్రవరంలో పర్యటించిన కవిత.. ఏపీ, తెలంగాణ సీఎంలు అన్నదమ్ముల్లా వ్యవహరించాలని, అపెక్స్ కౌన్సిల్‌లో నీటి పంపకాల అంశాన్ని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు ఒకే కుటుంబంలా కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలని కల్వకుంట్ల కవిత అన్నారు.

నాలుగైదు రోజుల క్రితమే ఆమె హైదరాబాద్‌లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్‌ డెడ్ స్టోరేజీ దిగువ నుంచి నీటిని తరలించుకుపోయేందుకు పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది. దానికి ఎటువంటి అనుమతులు లేదు. అయినా తాము బీజేపీతో పొత్తులో ఉన్నందున, కేంద్రం అండగా ఉందనే ధైర్యంతో తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోము,” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

అంటే తెలంగాణలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రాజకీయ విమర్శలు చేయడం, ఏపీలో ఉన్నప్పుడు ఈవిధంగా సామరస్యంగా వ్యవహరిస్తూ సుద్దులు చెప్పడం గమనిస్తే ఆమె కూడా తండ్రి, అన్నలాగే రాజకీయాలలో ద్వంద వైఖరి అనుసరిస్తున్నారని స్పష్టం అవుతోంది. కానీ తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆమె ఇదేవిధంగా మాట్లాడి ఉండి ఉంటే ఆమె మాటలకు విశ్వసనీయత ఉండేది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Phenomenal Actor, But Not A Superstar?

There is a significant difference between being a good actor and becoming a superstar. Stardom…

24 minutes ago

ఇదిగో.. బీఆర్ఎస్ నేతల ద్వంద్వ వైఖరికి నిదర్శనం!

తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు నదీ జలాల పేరుతో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని నిత్యం విమర్శిస్తూనే…

34 minutes ago