నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక జంటగా నటించిన “కళ్యాణ వైభోగమే” ఆడియో వేడుకపై ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ‘ప్రేమ – పెళ్లి – ఆ తర్వాత’ అనే మూడు అంశాల చుట్టూ సినిమా కధ తిరుగుతుందని స్పష్టమైనప్పటికీ, ట్రైలర్ మొత్తం పూర్తయిన తర్వాత “ఏదో” లోపించిందన్న అనుభూతి కలుగుతుంది. అదే సీన్ కు సీన్ కు మధ్య సాన్నిహిత్యం.
ట్రైలర్ ఉన్న షాట్లన్నీ వినోదాన్ని పంచే విధంగానే ఉన్నాయి గానీ, అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారనే దానిపై స్పష్టత లోపించింది. ‘అలా మొదలైంది’ సినిమా మాదిరిగానే కనపడుతున్నా… ట్రైలర్ అయితే ‘అలా ఎండ్’ కాలేదు అంటున్నారు నెటిజన్లు. బహుశా 2 గంటల నిడివి గల సినిమాలో స్పష్టత ఉండవచ్చు. అయితే నాగశౌర్య, మాళవికల సింపుల్ లుక్, అరుపులు లేని డైలాగ్ డెలివరీ, నేపధ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి.
ADVERTISEMENT





