యూనివర్సల్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం భారతీయుడు 2. 1996 లో విడుదలైన భారతీయుడు సినిమాలో సేనాపతి అనే 70 ఏళ్ల ముసలతను వ్యవస్థలోని అవినీతిపై చేసిన పోరాటాన్ని శంకర్ చూపించాడు. ఇప్పుడు భారతీయుడు 2 లో అదే సేనాపతి 90 ఏళ్ల వయసు వాడిలా కనిపిస్తాడట.
అయితే సినిమాలో ఫైట్లకు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెస్తున్నారట. ఈ సినిమా ఏప్రిల్ 14 2021లో తమిళ ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారట. అంటే ఈ సినిమా కోసం దాదాపుగా రెండేళ్ల పాటు నిరీక్షణ తప్పదు. భారీ చిత్రం కావటంతో షూటింగ్‌కే ఎక్కువ రోజులు సమయం పడుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే రాజకీయాలలోకి వచ్చిన కమల్ హస్సన్ ఇదే తన చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగబోతున్నాయి.
అంటే ఎన్నికలకు కొంచెం ముందు ఈ సినిమా విడుదల కాబోతుంది. అవినీతిపై పోరాటం గురించిన సబ్జెక్టు కావడంతో ఇది ఎన్నికలలో కమల్ కు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. భారతీయుడు 2 తన సినీ కేరీర్ లో చివరి సినిమా అని కమల్ ఇప్పటికే ప్రకటించారు.





