సంచలన విషయాలను చాలా సైలెంట్ గా చెప్పే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ దర్శకుడు వికాస్ బాల్ పై బాంబ్ పేల్చింది. ఓ మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు దర్శకుడి ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వికాస్ తో “క్వీన్” సినిమా చేస్తున్నపుడు అతనికి సెక్స్ వ్యసనం ఉందన్న విషయం తెలిసిందని చెప్పింది.
[m9ad]
తనతో ‘క్వీన్’ సినిమా చేస్తున్న సమయంలో వికాస్ కు వివాహం అయ్యిందని, కానీ వేరే మహిళలతో క్యాజువల్ సెక్స్ చేసానంటూ గొప్పగా చెప్పుకునేవాడని, వికాస్ బాల్ తో కలిసి పబ్లిక్ ఈవెంట్స్ కు రావాలంటే భయం వేసేసేదని, దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకునేవాడని, కురుల వాసనలు చూస్తూ మాట్లాడేవాడంటూ సదరు దర్శకుడు తీరును ఏకరువు పెట్టింది.
తాను ఏదైనా మాట్లాడితే…. ‘నీ దగ్గర నుండి వచ్చే వాసన తనకు చాలా ఇష్టం’ అంటూ వ్యాఖ్యానించేవాడని తెలిపిన కంగనా, ఇటీవల వికాస్ పై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలను విశ్వసిస్తున్నానని పేర్కొంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా సదరు మహిళ చేసిన ఆరోపణలకు మద్దతుగా తాను నిలిచానని గుర్తు చేసింది.



