చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చారా? మరి అప్పుడు మోడీ ఏంచేసినట్టు?

Kanna Lakshmi Narayana -BJPబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతి రోజు చంద్రబాబు నాయుడుని దూషిస్తూ ఏదో విధంగా వార్తలలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రాజకీయ అవసరాలకోసం అడ్డమైన హామీలు ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

[m9ad]

అయితే ఎన్నికలకు టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళిన సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు ఇచ్చారని అడ్డమైన హామీలన్నీ ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని అభ్యర్థి ఐన మోడీ సమక్షంలో ఇచ్చినవే. కాకపోతే కన్నా అప్పట్లో కాంగ్రెస్ లో ఉండబట్టి ఆయనకు ఆ విషయం తెలిసి ఉండకపోవచ్చు.

చంద్రబాబు ఇచ్చినవి అడ్డమైన హామీలు అయితే అప్పుడు మోడీ, వెంకయ్య నాయుడు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఎటువంటి హామీ? ఢిల్లీ తరహా రాజధాని అని మోడీ ఇచ్చిన హామీ ఎటువంటిది? ఇటువంటి ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి కన్నా చంద్రబాబుని విమర్శిస్తే ఎమన్నా గౌరవంగా ఉండవచ్చు

ADVERTISEMENT
Latest Stories