చంద్రబాబు మీద దాడి కరెక్టు అయితే అమిత్ షా మీద దాడికూడా కరెక్టే కదా?

Kanna Lakshmi Narayana - Chandrababu Naiduఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి పర్యటన సందర్భంగా కొందరు ఆయన ప్రయత్నిస్తున్న బస్సు మీదకు రాళ్ళు, చెప్పులు విసిరే ప్రయత్నం చెయ్యడం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించిన తీరు దారుణంగా ఉంది.

చేసుకున్న వాడికి చేసున్నంత మహదేవ అన్న చందంగా ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు మీద దాడి కరెక్టే అన్న విధంగా కన్నా మాట్లాడితే మొన్న ఆ మధ్య తిరుమల పర్యటనలో అమిత్ షా కాన్వాయ్ మీద కొందరు రాళ్లు రువ్వడం కూడా కరెక్టే కదా? అప్పుడు గగ్గోలు పెట్టి ఇప్పుడు సమర్ధించడం ఎంతవరకు సమంజసం?

ADVERTISEMENT

ప్రజాస్వాయంలో నిరసనలు అనేవి మాములే. కాకపోతే దాడులకు దిగబడటం వంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే, అందరికంటే బీజేపీ నాయకులకే రాష్ట్రంలో ఎక్కువ ఇబ్బంది అని తెలుసుకుంటే వారికే మంచిది. అమరావతి పై సరిగ్గా వైఎస్సార్ కాంగ్రెస్ ఎటువంటి స్టాండ్ తీసుకుందో సరిగా అదే స్టాండ్ బీజేపీ కూడా తీసుకోవడం విశేషం.

కేవలం అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తే నాయకులు ఉన్నంతవరకు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అంతే. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మొత్తానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కలిసి రౌడీ రాజకీయాలు ప్రోత్సహించేలా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories