అవును అచ్చు తప్పు కాదు.. ఇది వైసీపీ సీనియర్ నేత ‘ పేర్నీ’ తాండవం గురించే! ఆయనకు జగన్ అమరావతి సబ్జెక్ట్ కేటాయించినట్లున్నారు. కనుక తన సందేహాలకు సమాధానాలు చెప్పమని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని నిలదీస్తున్నారు.
నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో పేర్నికి కలిగిన సందేహాలు ఇవి.
1. మీ అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది?
2. ఆఫీసు భవనాల నిర్మాణాలకే 50 వేల కోట్లు ఖర్చు పెట్టేస్తే రైతులకు ఏం ఇస్తారు?
3. రెండేళ్ళలో ప్రజల మద్య కుల చిచ్చు రగిలించడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏం చేశారు?
4. అమరావతికి ఎన్ని కోట్లు అప్పు చేస్తున్నారు? అడిగితే సమాధానం చెప్పకుండా తిడతారెందుకు?
5. మావిగన్ అంటే భయం దేనికి?
6. నిర్మాణాలు పూర్తిచేయలేక అమరావతిని ఓ మున్సిపాలిటీగా వదిలేస్తారా?
7. రైతులకు మేమిచ్చిన 50 వేల ఇళ్ళ పట్టాలు రద్దు చేశాక ఇక అమరావతిలో ఎవరు ఉంటారు? జనం లేని అమరావతి దేనికి? అక్కడ స్టార్ హోటల్స్ ఎవరి కోసం కడతారు?
8. జనసేన బలహీన పడటంతో కాపులందరూ దూరం అవుతున్నారు. అందుకే ప్రశ్న రావణ్‌ని వేధిస్తున్నారా?
9. కాపులను పవన్ కళ్యాణ్ బకరాలు చేశాడు. నిజామా కాదా?
నేటికీ హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టు లేదా ఫ్యూచర్ సిటీ అంటూ అభివృద్ధి చేస్తుంటే తప్పు కానప్పుడు ఇంకా నిర్మాణంలో ఉన్న రాజధాని గురించి ఇలా అడగడం పిచ్చి ప్రశ్నే కదా? అమరావతి అంటే అనేక ఇకానిక్ భవనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల సముదాయం. వాటిని పూర్తయిన మేరకు వాడుకోవచ్చు. గతంలో జగన్ ప్రభుత్వం ఇలాగే సచివాలయం, శాసనసభ, హైకోర్టుని వాడుకుంది కదా?
అమరావతిలో నిర్మించే ప్రతీ ఒక్క భవనానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. బ్యాంకులు, సెంట్రల్ లైబ్రేరీ, రిజర్వ్ బ్యాంక్, సీబీఐ, యూనివర్సిటీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వంటి వాటికి ఆయా సంస్థల నిధులతోనే నిర్మాణాలు జరుగుతాయి.
రాష్ట్రంలో కుల, శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో పేర్ని నానికే బాగా తెలుసు.
మావిగాన్ అంటే కూటమి నేతలు భయపడటం లేదు జగన్ ఈ స్టాండ్ తీసుకొన్నందుకు చాలా సంతోషిస్తున్నారు. నిజానికి మావిగన్ వైసీపీ కొంపే ముంచుతుందని వైసీపీ నేతలే భయపడుతున్న మాట వాస్తవమా కాదా?
ఇప్పటికే అమరావతి గురించి దేశ వ్యాప్తంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మరింత రూపురేఖలు వస్తే అప్పుడు కూడా వైసీపీ నేతలు మావిగన్ అంటూ ఎన్నికలకు వెళ్ళగలరా?
నేడు మారుమూల ఏజన్సీలలో కూడా ప్రజలు నివసిస్తున్నప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతిలో నివసించడానికి ప్రజలు ఇష్టపడరని పేర్ని ఎలా అనుకుంటున్నారో? ఎవరూ ఉండకపోతే అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేవారు వెర్రివాళ్ళనుకోవాలి. ఇప్పటికే అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అంటే అర్థం ఏమిటి?
ప్రశ్న రావణ్‌పై కేసు పెట్టి వేధిస్తే కూటమి ప్రభుత్వానికి లాభపడుతుందని పేర్ని ఎలా అనుకున్నారో?
కాపుల నాయకుడుగా గౌరవ మర్యాదలు పొందిన ముద్రగడని బకరాని చేసింది ఎవరు?






