అసలు మోడీ ప్రత్యేక హోదా ఇస్తా అని ఎప్పుడూ అనలేదంట

Kanna Lakshmi Narayana says Modie never promise on AP Special Statusరాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రానికి చేసిన మోసాన్ని కప్పిపుచ్చడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఎపుడూ చేప్పలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భాజపాతో కలిసుకున్నంత వరకూ హోదా పేరెత్తని చంద్రబాబు… ఆ తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.

ADVERTISEMENT

ఇప్పటిదాకా మోడీ కూడా చెప్పని అబద్ధం రాష్ట్ర నేతలు చెబుతున్నారు. కేంద్ర నేతలు ఇస్తాం అన్నాం గానీ 14 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. కనీసం కేంద్ర నాయకులు కూడా చెప్పలేని అబద్ధాలు ఇక్కడే తిరిగే నాయకులు చెబుతున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిక మేరకే కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని కన్నా తెలిపారు.

ఇటువంటి వ్యాఖ్యలతో ఢిల్లీ పెద్దల మన్ననలు పొందగలరేమో గానీ ప్రజలను మెప్పించలేము అని తెలుసుకుంటే వారికే మంచిది. వీలైతే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నాలుగు ప్రాజెక్టులు లేకపోతే కొన్ని నిధులు తెస్తే కనీసం ప్రజలు హర్షిస్తారు. ఇలాగే ఉంటే బీజేపీ కనీసం ఖాతా తెరవడం కూడా కష్టమే.

ADVERTISEMENT
Latest Stories