ఊపందుకున్న ‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. నిన్నటి దాకా ప్రముఖులుగా వెలుగొందిన పలువురు ఇప్పుడు లైంగిక ఆరోపణలతో తల దించుకోవాల్సి వస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ పై నటి, మోడల్ కేట్ శర్మ తీవ్ర ఆరోపణలు చేసింది. ఐదారుగురి ఎదుటే మసాజ్ చేయాలని కోరారని… బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు యత్నించారని ఆరోపించింది.
[m9ad]
ADVERTISEMENT
ఒక రాత్రి తనతో గడపకపోతే సినిమాలో తొలి అవకాశం ఇవ్వబోనని చెప్పారని తెలిపింది. ఈ మేరకు ఆమె పోలీసుకులకు కూడా ఫిర్యాదు చేసింది. మరోవైపు, సుభాష్ ఘాయ్ పై మరో మహిళ కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసింది. ఈ ప్రకంపనలలో ఇంకెందరి పేర్లు బయటకు వస్తాయోనని బాలీవుడ్ వర్గాలు ఉత్కంఠతో చూస్తున్నాయి.
ADVERTISEMENT



