ట్రైలర్ టాక్ – టైటిల్ రోల్ మిస్ మ్యాచ్!

Kathalo Rajakumari Official Theatrical Trailerఈ తరం కధానాయకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో నారా రోహిత్. డిఫరెంట్ కధలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నారా రోహిత్ అనగానే, ఖచ్చితంగా డిఫరెంట్ సినిమా అనుకోవడం ప్రేక్షకులకు పరిపాటిగా మారిపోయింది. అలాంటి ప్రేక్షకులను ఈ “కధలో రాజకుమారి” ధియేటిరికల్ ట్రైలర్ ఏం అసంతృప్తికి గురి చేయదు గానీ, ఈ టైటిల్ రోల్ కనిపించిన హీరోయిన్ నమిత ప్రమోద్ మాత్రం, క్యారెక్టర్ కు సూట్ కాలేదన్న విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో పాటలకే పరిమితం అవుతోన్న హీరోయిన్ పాత్రలలో, ఏకంగా టైటిల్ రోల్ ను పోషించే అరుదైన పాత్ర నమితకు దక్కడం చెప్పుకోదగ్గ విషయమే. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయంలో అంచనాలు తప్పుగా వేసినట్లుగా కనపడుతోంది. ట్రైలర్ లో ఏదైనా బ్యాడ్ ఉందంటే… అది తొలుత హీరోయిన్ గా నమితను ఎంపిక చేయడమే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. బుల్లితెరపైనే చూస్తుంటేనే… ఎక్స్ ప్రెషన్స్ పలికించలేక నమిత పడిన ఇబ్బందులు కనపడుతుంటే… రేపు సిల్వర్ స్క్రీన్ పైన ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT

ఇక ‘జ్యో అచ్యుతానంద’ హిట్ జోడి నారా రోహిత్, నాగశౌర్యల లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఫుల్ గడ్డం పెంచి నాగశౌర్య పోలీస్ పాత్రలో డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నం చేయగా, రెండు డిఫరెంట్ షేడ్స్ లో నారా రోహిత్ కనపడుతుండడం విశేషం. మొత్తమ్మీద ఓ రెగ్యులర్ ప్రేమకధను తనదైన శైలిలో కొత్తగా ప్రజెంట్ చేయడానికి దర్శకుడు మహేష్ సూరపనేని చేసిన ప్రయత్నం ఈ ట్రైలర్ లో కనపడుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ ను బాగా కట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories