“కత్తి” రీమేక్ బాల్ మెగాస్టార్ కోర్టులో!

kaththi-remake-ball-in-chiranjeevi-courtమెగాస్టార్ 150వ చిత్రం “కత్తి” రీమేక్ ఖరారు కావడంతో అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమా స్టోరీ తనదేనని నరసింహారావు అనే రచయిత ఫీల్డ్ లోకి ఎంటర్ కావడం, సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఛైర్మన్‌గా వున్న కథా వేదిక ఆధ్వర్యాన ఓ కమిటీ ఏర్పాటు కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ కమిటీ నరసింహారావు స్ర్కిప్ట్‌ను, కత్తి స్టోరీని పరిశీలించి రెండూ ఒకే విధంగా వున్నాయని తీర్మానించింది. దీంతో మొదట ఈ సినిమాని రీమేక్ చేసే ముందు నరసింహారావుకు పరిహారం చెల్లించాలని ప్రొడ్యూసర్‌ని కోరింది.

తమిళ వెర్షన్ నిర్మాతలు ఈ రచయితకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే సినిమాని రిలీజ్ చేశారు. ఐతే, తెలుగులో వచ్చేసరికి నరసింహారావు ఈ ఇష్యూని లేవనెత్తారు. ఇతనికి పరిహారం చెల్లించకుండా రీమేక్ చేసేందుకు పూనుకుంటే సహాయ నిరాకరణ చేస్తామని తెలుగు నిర్మాతల మండలి తమ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.

ADVERTISEMENT

ఇక బంతి మెగాస్టార్ చిరంజీవి కోర్టులోనే వుంది. ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఈ మూవీ రీమేక్ ఆధారపడి వుంది. ఏది ఏమైనా దాసరి నారాయణరావు – మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలను ఈ వివాదం మరోసారి పెంచిందనే కామెంట్స్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినబడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories