
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ వేడుకలు కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదం తో, కవిత జాగృతి కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయాలలో మిళితమైపోయాయి.
అయితే బిఆర్ఎస్ పార్టీలో జరిగిన తాజా పరిణామాలతో కవిత రాజకీయ బతుకు, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తన తండ్రి పార్టీ నుంచే సస్పెన్షన్ వేటు ఎదురవ్వడం, పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక మద్దతు దొరకపోవడంతో కవిత రాజకీయ ప్రయాణం ఎటువైపుకి వెళ్లనుంది అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో బలంగా వినిపిస్తుంది.
ఇటు తిరిగి బిఆర్ఎస్ లోకి వెళ్లలేని పరిస్థితి, ఇక బిఆర్ఎస్ కు ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు చేయి చాచలేదు, అలాగే కేసీఆర్ మీద ఉన్న రాజకీయ పగతోనే తనను ఆరు అంశాలు తీహార్ జైలుకు పంపారు అంటూ ఆరోపించిన బీజేపీ నుంచి పువ్వు అందుకోలేదు.
అంటే కవిత రాజకీయ భవిష్యత్ అనేది తన సొంత కుంపటి ద్వారా మాత్రమే ముందుకెళ్లగలదు. అయితే మరి ఆ సొంత కుంపటి ఏర్పాటుకు కవితకు జాగృతి కార్యక్రమాలు, దాని ద్వారా నిర్వహించే బతుకమ్మ వేడుకలు పునాదులు వేయనున్నాయా.?
ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత తెలంగాణలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కవిత జాగృతి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి మారిపోగా, కవిత బతుకమ్మ వేడుక ద్వారా తెలంగాణ సమాజానికి చాల దగ్గరయింది. అయితే నేడు బిఆర్ఎస్ నుండి బయటకొచ్చిన కవిత ఒంటరిగా రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు.
మరి ఈ రాజకీయంలో కవిత బతుకమ్మ కార్యక్రమాలు ఎక్కడ కానరావడం లేదు, వై.? అనే ప్రశ్న ఇప్పుడు చర్చ నియాంశంగా మారింది.
Ranabaali marks the second collaboration between director Rahul Sankrityan and Vijay Deverakonda. Set against a…
It has been more than a couple of years since the formation of the NDA…