
బిఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే ముందు నుంచి కూడా కవిత ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హరీష్ రావు ని టార్గెట్ చేస్తున్న మాట వాస్తవం. అయితే ఆ టార్గెట్ రోజురోజుకి తన పరిధిని పెంచుకుంటుంది.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా నాడు హరీష్ టార్గెట్ గా కవిత వేసే బాణాలు పరోక్షంగా ఉంటే నేడు జాగృతి అధ్యక్షురాలిగా కవిత ఎక్కుపెడుతున్న బాణాలు ప్రత్యక్షంగా సూటిగా హరీష్ ని గురి పెడుతున్నాయి.
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కవిత మీడియా ముందుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార మైకులు ఆగితే ఈ బూతు తిట్ల పురాణాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించింది అంటూ మొదలు పెట్టిన కవిత తన లక్ష్యం వైపు వెళ్లారు.
తెలంగాణలో మొత్తం 116 మున్పిపాలిటీలకు, 7 కార్పొరేట్లకు ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో హరీష్ నియోజకవర్గమైన సిద్దిపేటకు మాత్రమే భూగర్భ డ్రైనేజీలు అనుమతి ఎలా లభించింది.? బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా సిద్దిపేటకు మాత్రమే పనులు జరిగిపోతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నక్క కి ఉన్న అంతర్గత సంబంధాలే వీటి వెనుకున్న అసలు వాస్తవాలు అంటూ కవిత మరోమారు సిద్ధిపేట పేరుతో హరీష్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
అయితే కవిత ఇలా పదేపదే హరీష్ టార్గెట్ గా ఎందుకు విమర్శలు సంధిస్తున్నారు.? హరీష్ భుజం మీద గన్ను పెట్టి బిఆర్ఎస్ పై రాజకీయ యుద్ధం చేయదలచారా.? లేదా హరీష్ లేని బిఆర్ఎస్ యే లక్ష్యంగా కవిత రాజకీయం చేస్తున్నారా.? అసలు కవిత కు హరీష్ కి మధ్య ఎందుకింతలా రాజకీయ ద్వేషం ఏర్పడింది.?
కేసీఆర్ కి కవిత దూరం కావడానికి, బిఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ తో బయటకు రావడానికి తెరవెనుక చక్రం తిప్పింది హరిషా.? లేక బిఆర్ఎస్ లో కేసీఆర్ కుమార్తెగా తనకు దక్కాల్సిన స్థానం, స్థాయి హరీష్ కి దక్కిందనే కవిత హరీష్ పై రాజకీయ ద్వేషాన్ని పెంచుకున్నారా.?
For years, Vijay Deverakonda and Rashmika Mandanna's relationship remained one of the most closely followed…
In the film industry, a famous surname can make the first step much easier. It…