
కల్వకుంట్ల కవిత నేడు భర్త, కుమారుడు, జాగృతి సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “స్వామివారి దయతో అక్రమ కేసు నుంచి బయట పడగాలిగాను. నాలుగేళ్ళు వేదన నుంచి విముక్తి లభించింది. న్యాయం ధర్మం నావైపు ఉన్నందునే స్వామివారి ఆశీసులు లభించాయి. ఈ కేసులో నాకు క్లీన్ చిట్ లభించింది. స్వామివారి ఆశీసులతో అన్ని వర్గాల కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నా,” అని చెప్పారు.
తన తండ్రి కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని వేధించేందుకే (కట్టడి చేసేందుకే) కేంద్ర ప్రభుత్వం ఈ భూటకపు కేసుని సృష్టించిందని కల్వకుంట్ల కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు.
తాను ఏ తప్పు చేయలేదని కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తానని జైలుకి వెళ్తున్నప్పుడు చెప్పారు. కానీ బెయిల్‌పై బయటకు వచ్చారు తప్ప కేసు కొట్టేస్తే బయటపడలేదు.
ఇప్పుడు కూడా నేరం చేసినట్లు నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు చూపకుండా, హడావుడిగా చార్జ్ షీట్ ఫైల్ చేసిందని దిగువ కోర్టు సీబీఐని ఆక్షేపిస్తూ కేసు కొట్టేసింది తప్ప ఈ కేసులో నిందితులు ఎటువంటి నేరమూ చేయలేదని ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. కానీ ఇచ్చిందని కవిత చెప్పుకుంటున్నారు.
కేసీఆర్‌ని వేధించేందుకే ఈ కేసు అని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు. కనుక బయటకు వెళ్ళే ఒప్పందం మేరకే ఆమెకు విముక్తి లభించిందనుకోవచ్చా?కొత్త పార్టీ ఏర్పాటు కూడా ఈ విముక్తి ఒప్పందంలో భాగమేనా? తెలంగాణలో బిజేపి అధికారంలోకి రావడానికి అవరోధంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చేందుకు బిజేపి వదిలిన బాణమనుకోవచ్చా?
ఈ అనుమానాలు దేనికంటే ఆమెకు విముక్తి కల్పించి తెలంగాణ బిజేపి మెడకు మరో గుదిబండ తగిలించాలని బిజేపి అధిష్టానం అనుకోదు కదా?
తండ్రికి ఆమె వ్రాసిన రహస్య లేఖని ఎవరో మీడియాకు లీక్ చేయడంతో ఈ నాటకీయ పరిణామాలన్నీ మొదలయ్యి, కేసు నుంచి విముక్తి, కొత్త పార్టీ ఏర్పాటు వరకు వచ్చాయి. కనుక మున్ముందు మరిన్ని నాటకీయ పరిణామాలు జరిగే అవకాశం తప్పక ఉంటుంది. వాటిలో బీఆర్ఎస్ పార్టీని నిలువునా చీల్చడం కూడా ఒకటి కావచ్చు. అవునో కాదో కొత్త పార్టీ పెట్టాక తెలుస్తుంది. అంతవరకు తిరుమల శ్రీవారి సాక్షిగా ఆమె చెప్పిన మాటలనే నమ్మక తప్పదు.
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…