
బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్లకు విరుద్ధంగా కవిత తన స్వరాన్ని పెంచింది, అలాగే అందుకు తగ్గట్టే అటు బిఆర్ఎస్ నుంచి కూడా కవిత పై ఎటాక్ మొదలయ్యింది. అయితే ఈ ఇరు వర్గాల పోరులో మధ్యలోకి కవిత భర్త అనిల్ కుమార్ పేరు తెరమీదకొచ్చింది.
అయితే కవిత బిఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ బిడ్డ హోదాలో గతంలో పదవుల పైరవింగ్ లు చేసిన మాట వాస్తవం కాదా.? అందులో కవిత భర్త అనిల్ పాత్ర లేదా.? అంటూ బిఆర్ఎస్ నేతల నుంచి ఎదురుదాడి మొదలయ్యింది. ఈ నేఅపదయంలో తన భర్త మీద వచ్చిన ఆరోపణలకు గాను కవిత చాల ఘాటు రిప్లై ఇచ్చింది.
బిఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో తెలంగాణ రాజకీయాలలో ఎన్నడూ తన భర్త పేరు వినపడలేదని, ఇప్పుడొచ్చి తన భర్త అలా చేసాడు ఇలా చేసాడు అంటూ ఆరోపణలు చేస్తారా.? సొంత ఇంటల్లుడి ఫోన్ కూడా టాప్ చేస్తారా.? పార్టీ నుంచి బయటకు వెళ్లకొట్టినా ఇంకా మీ కళ్ళు చల్లబడడం లేదా.? కొంచమైనా సిగ్గుండాలిగా.?
కేసీఆర్ నీడన ఉంటూ ప్రజల సొమ్ము తిన్నది కాక నా పై వెకిలి ప్రయత్నాలు చేస్తారా.? నా పై కానీ నా కుటుంబం జోలికి గాని వస్తే మీ కాళ్ళు విరగొడతాను అంటూ కవిత తన విమర్శల డోసు పెంచింది. అలాగే ఎదో ఒక నాడు నేను సీఎం అయ్యి తీరుతా, అప్పుడు 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాల పైనా విచారణ జరిపిస్తా అంటూ శపథం చేసారు.
అయితే కవిత బిఆర్ఎస్ పై ఒక్కో విమర్శల మెట్టు ఎక్కుతూ తన స్వరాన్ని పెంచుతూ బిఆర్ఎస్ పతనానికి బాటలు వేస్తుంది. ఇటువంటి సమయంలో కూడా కేసీఆర్ తన మౌన దీక్షను వీడి, అజ్ఞాతాన్ని వదిలి బయటకు వచ్చి తన గళం వినిపించకపోతే కేసీఆర్ చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా బిఆర్ఎస్ రాజకీయం కవిత విమర్శలకు – బిఆర్ఎస్ నేతల ఆరోపణలకు మధ్య నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
సరైన సమయం వచ్చినప్పుడు కేసీఆర్ తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెడతారు, తిరిగి పార్టీని అధికారంలోకి తెస్తారు అంటూ కేటీఆర్, హరీష్ చేస్తున్న ప్రకటనలలో సరైన సమయం అంటే ఏంటి.? పార్టీ పూర్తిగా ప్రజల మధ్య దోషిగా నిరూపించబడినప్పుడా.? లేక కవిత బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి మొత్తాన్ని బట్టబయలు చేసినప్పుడా.?
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…