Telugu

ఉద్యమ సమయం నుంచే దోపిడీ షురూ: కవిత

భార్య భర్తలు లేదా అత్తాకోడళ్ళు కొట్టుకొని రోడ్డున పడితే కుటుంబం పరువు ఎలాగూ పోతుంది. అది ఇరుగు పొరుగులకు వినోదం కూడా. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరుల మద్య జరుగుతున్న మాటల యుద్ధాలలో సరిగ్గా ఇదే జరుగుతోంది.

కృష్ణారావు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా, ఆమె మంత్రి పదవులు అమ్ముకున్నారని కృష్ణారావు ఆరోపించారు.

ADVERTISEMENT

దాంతో ఆమె నేడు మళ్ళీ ప్రెస్‌మీట్‌ పెట్టి, “నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నేను ఏనాడూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆశించలేదు, లబ్ది పొందలేదు. వ్యాపారంలో ఉన్నా నా భర్త సంపాదనతోనే మా ఇల్లు గడుస్తుంది. నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ చేశాను తప్ప ఎవరి నుంచి పైసా ఆశించలేదు. మీ లెక్కన మంది మీద పడి దోచుకొని మేము బ్రతకలేదు.

ఉద్యమ సమయంలో మీరు ఎవరెవరిని బెదిరించారో… ఏయే సినీ స్టూడియోల నుంచి ఎంత వసూలు చేశారో అన్నీ నాకు తెలుసు. కానీ అప్పుడు నేను నోరు విప్పితే ఉద్యమాలు దెబ్బ తింటాయని మౌనంగా ఉండిపోయాను.

మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అవినీతి గురించి నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాలి. కానీ వాటి గురించి నేను ప్రశ్నిస్తే వాటిని నాకు ఆపాదించి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోను. ఒక్కొక్కరినీ కోర్టుకీడ్చుతాను…. జాగ్రత్త!” అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

అంతేకాదు… బీఆర్ఎస్‌ పార్టీ సొంత మీడియా.. టీన్యూస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలకు ఆమె లీగల్ నోటీసులు కూడా పంపారు. వారం రోజుల్లోగా బహిరంగ తనకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారి జోలికి, సినీ పరిశ్రమ జోలికి పోకుండా చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమాలు చేశామని బీఆర్ఎస్‌ పార్టీ పదేపదే చెప్పుకుంటుంది. కానీ వాస్తవం ఏమిటో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నోటితోనే నేడు బయటపెట్టారు.

ఉద్యమాలు ముగిసి కేసీఆర్‌ నేతృత్వంలో పదేళ్ళ బీఆర్ఎస్‌ పాలనలో కూడా విచ్చలవిడిగా భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు జరిగాయని కల్వకుంట్ల కవిత స్వయంగా చెపుతున్నారు కదా?

కనుక తెలంగాణతో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్‌ పార్టీ మాత్రమే బాగుపడ్డాయని కాంగ్రెస్‌, బీజేపిలు చేస్తున్న ఆరోపణలను కవిత ఆరోపణలు ధృవీకరిస్తున్నాయి కదా? బీఆర్ఎస్‌ పార్టీ వాటికి సమాధానం చెప్పకపోయినా ఆమెకు సమాధానం చెప్పగలదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Filmmakers Now Write With the Censor Board in Mind?

Getting a film to the release date is one thing. Getting it past the censor…

14 minutes ago

REJECTED! Ram Charan In No Mood to Repeat Past Blunders?

Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…

44 minutes ago