Telugu

కవిత చరిత్ర చదవాలి…జీవితాలు చూడాలా.?

బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత తన దారి తానూ చూసుకోవడానికై బిఆర్ఎస్ గుర్తింపుని, కేసీఆర్ ఛాయను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జాగృతిని బలోపేతం చేసే పనిలో పడ్డారు.

అయితే కవిత చేసిన ఈ రాజీనామాలను అటు బిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు శాసనమండలి చైర్మన్ కానీ ఇంతవరకు ఆమోదించలేదు. దీనికై కవిత శాసనమండలిలో తన రాజీనామా ఆమోదం పై అధికార ముద్రవేయాలంటూ సభ చైర్మన్ గుత్తా సుఖేందర్ ని కోరారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో రాజీనామా విషయంలో కవిత మరోమారు పునరాలోచించుకోవాలని, ఆవేశం తో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎప్పుడు కూడా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ కవితకు సూచనలు చేసారు గుత్తా.

గుత్తా సూచనలను తోసిపుచ్చిన కవిత తానూ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నన్నాని, తన రాజీనామా ను ఆమోదించి తనకు బిఆర్ఎస్ నుంచి పూర్తి స్వేచ్ఛనివ్వాలంటూ విజ్ఞప్తి చేసి, వ్యక్తిగా సభ నుండి వెళుతున్నా నేను భవిష్యత్ లో ఒక శక్తిగా తిరిగొస్తానంటూ తన రాజీనామా పై రాజీలేని పోరాటం చేస్తున్నారు.

కవిత పలికిన ఈ బలమైన మాటలను కవిత ఆత్మవిశ్వాశంగా భావించాలా.? లేక రాజకీయాలలో పూర్తి అవహగానా లేక వచ్చే అతి విశ్వాసంగా పరిగణించాలా అనేది కాలమే బదులు చెపుతుంది. రాజకీయాలలో కొమ్ములు తిరిగిన నాయకులు సైతం ఒక్కసారి రాజకీయంగా ఎదురుదెబ్బ తింటే దాన్ని నుంచి కోలుకోవడానికి, ఆ దెబ్బ నుండి పార్టీ బయటకు తీసుకురావడానికి ప్రత్యర్థులతో కురుక్షేత్రమే చెయ్యాల్సి ఉంటుంది.

2019 – 2024 వరకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా వైసీపీ దెబ్బకి ఆరు నెలల పాటు జైల్లో బందీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, అలాగే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పార్టీ సైతం బతుకు పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది.

ఇక ఒక ఉద్యమ పార్టీగా పుట్టి, పదేళ్ల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రేవంత్ కొట్టిన ఒక్క దెబ్బకి ఉనికి కోసం ఉద్యమించాల్సి వస్తుంది. అలాగే సినీ యాక్టర్ గా మంచి ఫ్యాన్ బేస్ ఉండి, వ్యక్తిగతంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకున్నా పవన్ కళ్యాణ్ కు సైతం జనసేనను అధికారంలోకి తీసుకురావడానికి పొత్తు కావాల్సి వచ్చింది, పదేళ్ల సమయం పట్టింది.

ఇక వైఎస్ఆర్ రాజకీయ ఛరిష్మా ఉండి, సామాజికంగా, ఆర్థికంగా తనకంటూ సొంత బలం ఉండి కూడా జగన్ కు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి దాదాపు 8 ఏళ్ళ పోరాటం అవసరమయ్యింది, ఇక 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వై నాట్ 175 అంటూ అతివిశ్వాసంతో రెచ్చిపోయి చివరికి 11 కి పడి ప్రతిపక్ష హోదా కోసం కోర్ట్ మెట్లెక్కాలిసిన దయనీయ స్థితిలో వైసీపీ పడింది.

ఇక అన్న వదిలిన బాణం లా రాజకీయ తెరమీద మెరిసిన షర్మిల ఇప్పుడు రాజకీయల నుండి కనుమరుగయిపోయే పరిస్థితి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ గులాబీ సైన్యంతో పెద్ద రాజకీయ యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది.

అలాగే కేంద్రంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బీజేపీ సైతం తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి కాదుకదా కనీసం ప్రతిపక్షంలోకి కూడా రాలేకపోతుంది. ఇలా ఎన్నో రాజకీయ పార్టీల చరిత్రలు, ఎందరో రాజకీయ నాయకుల వర్తమానాలు కవిత రాజకీయ భవిష్యత్ కి మంచి ఉదాహరణలు.

ఒక్కసారి కవిత ఈ నేతల రాజకీయ జీవితాలను, ఆ పార్టీల చరిత్రలను చదివితే రాజకీయాలలో రాణించడం అంటే పార్టీకి, పార్టీ పదవికి రాజీనామా చేసినంత ఈజీ కాదు అనేది స్పష్టమవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Trivikram’s God of War: NTR Fans Panic After AK47 Fiasco

NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…

8 hours ago

IND vs WI T20: Sarpanch Destroys WI! Nightmare Begins?

Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…

8 hours ago