Telugu

కవిత కారు ప్రయాణమే బిఆర్ఎస్ కి ప్రమాదమయ్యిందా.?

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత రోజురోజుకి బిఆర్ఎస్ నేతల పై విమర్శల డోసు పెంచుకుంటూ పోతున్నారు. మరి ముఖ్యంగా కేసీఆర్ బంధువైన, బిఆర్ఎస్ ముఖ్య నాయకుడైన హరీష్ రావు టార్గెట్ గా కవిత తన రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో నీటి ప్రోజెక్టుల పేర్లు చెపుతూ హరీష్ కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యారని కవిత తన విమర్శల పదును పెంచింది.

ADVERTISEMENT

అందుకు పాలమూరు – రంగా రెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ మొదట ఓపెన్ పంప్ హౌస్ గా ఉండాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టర్లతో హరీష్ కుమ్మక్కు కావడంతో దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారంటూ,

దాని ఫలితంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఇప్పటికి రెండు మోటర్లు పనిచేయకుండా పోయాయంటూ ఆ పాపం ఎప్పటికి హరీష్ దే అంటూ కవిత హరీష్ పై విరుచుకుపడ్డారు.

అయితే రెండేళ్ల సుదీర్ఘ గ్యాప్ తరువాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకొచ్చారని, అధికార కాంగ్రెస్ కి గట్టి బదులు చెప్పారని ఒక పక్క బిఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతుంటే ఇక ఇప్పుడు కవిత హరీష్ పై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మళ్ళీ రాజకీయంగా ఇరుకున పడేస్తున్నాయి.

బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ అవినీతి అంటే అందులో ఎంతోకొంత వాటా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో కూడా ఖచ్చితంగా పడుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది అనే సామెత మాదిరి వినగా వినగా కవిత విమర్శలు కూడా తెలంగాణ ప్రజలను ఎదో రోజు ప్రభావితం చెయ్యగలదు, అలాగే ఆ ప్రభావం ఆ పార్టీ మీద ఆ పార్టీ నేతల మీద పడే అవకాశం లేకపోలేదు.

పదేళ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ప్రయాణం చేసిన కవిత, కేసీఆర్ కుమార్తెగా కేటీఆర్ చెల్లిగా హరీష్ బంధువుగా వారి తెరచాటు రాజకీయాలను కూడా చాల దగ్గర నుండి చూసి ఉంటారు. కాబట్టి కవిత ఎప్పటికైనా కేసీఆర్ గులాబీ కారుకి ఒక అణుబాంబు మాదిరి ప్రమాదమనే చెప్పాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Aadarsha Kutumbam’s BGM Confusion Ends

Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…

14 minutes ago

Actress Under Fire: I Stay Away from Fake Success Meets

Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…

23 minutes ago