
ఊహించినట్లే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బోర్లా పడగానే కల్వకుంట్ల కవిత కొంగు బిగించి కేటీఆర్‌ని దూది ఏకినట్లు ఏకేశారు.
మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన అన్న కేటీఆర్‌ని ఉద్దేశ్యించి, “మున్సిపల్ మంత్రిగా చేశానంటారు. ఏం చెప్పబోతే నాకన్నీ తెలుసంటారు. కానీ మున్సిపల్ ఎన్నికలలో కేవలం 13 మున్సిపాలిటీలే దక్కాయి. సిగ్గు లేకుండా మాకు అవే ఎక్కువని గొప్పగా చెప్పుకుంటున్నారు కూడా! ఇదా మీ నాయకత్వం? ఇదా మీరు చేసిన నిర్వాకం?” అంటూ అన్న, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కల్వకుంట్ల కవిత తట్లు తేలేలా చురకలు వేశారు.
బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఫేవరేట్ నేత హరీష్ రావుకి ‘గుంట నక్క’ అని ఆమె ట్యాగ్ తగిలించారు. పార్టీలో నుంచి తనను బయటకు గెంటించిన ఆయనే ఏదో రోజు బీఆర్ఎస్ పార్టీ నిలువునా ముంచేస్తారని కల్వకుంట్ల కవిత రోజూ హెచ్చరిస్తూనే ఉంటారు.
“జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో ఓటమికి పూర్తిగా ఆయనే బాద్యుడు… సిఎం రేవంత్ రెడ్డితో కుమ్మకయ్యి పార్టీని దెబ్బ తీశారు,” అని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తారనుకుంటే, ఆమె అన్న కేటీఆర్‌ని టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, అసమర్దతని ఎండగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం అయ్యిందని, ఈ ఎన్నికలలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కల్వకుంట్ల కవిత అన్నారు.
ఈ ఎన్నికలలో ఓటమి తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపిలను అడ్డుకునే శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అదే తెలంగాణకు శ్రీరామ రక్ష,” అని అన్నారు.
కానీ కవిత ఏమన్నారంటే, “కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయమని నిరూపించుకోలేకపోవడం వల్లనే ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించారు. అందువల్లే అంత ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ దారుణంగా విఫలమైంది కనుక దానికి ప్రత్యామ్నాయంగా మేము కొత్త పార్టీతో వస్తున్నాము,” అని అన్నారు.
కవిత పెట్టబోయే పార్టీలోకి ఆకాశంలో నుంచి నేతలు ఊడిపడరు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరో పదేళ్ళు ఉండే అవకాశం ఉందని సిఎం రేవంత్ రెడ్డి చెపుతున్నారు. బిజేపిది హిందుత్వ అజెండా. కనుక ఆ రెండు పార్టీల నుంచి ఎవరూ ఆమె పంచన చేరే అవకాశం లేదు.
ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించి భంగపడినవారు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం టికెట్ల కోసం ఆమె గూటికి చేరే అవకాశం ఉంది. అది కూడా ఎన్నికల ఫలితాలు వెలువడే వరకే! ఆ తర్వాత జంప్ చేసి వెళ్ళిపోవడం ఖాయమే.
కనుక బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే, ఆమె ఆ పార్టీనే నిలువునా చీల్చి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నారనుకోవచ్చు. కాస్కో భయ్యా… కాస్కో డాడీ అని ముందే హెచ్చరించి బీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ తీయబోతున్నారు. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ సిద్దమేనా?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…