
తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలాయన్నట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరినో ఏదో ప్రశ్నిస్తే మరెవరివో పేర్లు, భాగోతాలు బయటపడుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ కేసులో మరోసారి సీబీఐ ద్వారా అరెస్ట్ అయిన ఆమెను సిబాధికారులు ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐరిమాండ్ రిపోర్టులో అనేక కొత్త విషయాలను బయటపెట్టింది.
అయితే వాటిలో చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రరెడ్డిని బెదిరించి రూ.80 లక్షలు ముడుపులు తీసుకున్నారట. అడిగినంతా డబ్బు ముట్టజెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో మీ ఫార్మా కంపెనీ, వ్యాపారాలు ఎలా నడుస్తాయో చూస్తానని బెదిరించడంతో ఆయన గత్యంతరం లేక ఆ సొమ్ముని ఆమె అధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ ఖాతాలో జమా చేశారట!
ఆ తర్వాత మహబూబ్ నగర్‌లో లేని వ్యవసాయ భూమిని ఆయన చేత కొనిపించిన్నట్లు నకిలీ భూపత్రాలతో మరో 14 కోట్లు గుంజారని సీబీఐ నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మళ్ళీ మరో 25 కోట్లు వసూలు చేసేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారని సీబీఐ నివేదికలో పేర్కొంది.
మరో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడ కల్వకుంట్ల కవిత రూ.50 కోట్లు ఇవ్వాలని బెదిరించారని కానీ ఆయన రూ.25 కోట్లకు ఆమెను ఒప్పించి కొడుకు రాఘవ్ రెడ్డి ద్వారా ఆమెకు చెల్లించారని సీబీఐ నివేదికలో పేర్కొంది.
వీరిద్దరూ ఏపీలో అధికార వైసీపికి చెందినవారే. జగన్, విజయసాయి రెడ్డిలకు అత్యంత సన్నిహితులే. అంత పలుకుబడి గలవారిని కూడా కల్వకుంట్ల కవిత బెదిరించి డబ్బు గుంజడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయాలన్నీ ఎవరో చెప్పి ఉంటే కట్టుకధలుగా కొట్టిపారేయవచ్చు.
కానీ వైసీపి సొంత పత్రిక సాక్షి శుక్రవారం ఆన్‌లైన్‌లో సంచికలోనే ‘సీబీఐ: కవిత జ్యూడిషియల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు’ అనే శీర్షికన ప్రచురించబడ్డాయి. కనుక నమ్మి తీరాల్సిందే.
ఈ కేసు, దానిలో కవిత పాత్ర, ఆర్ధిక లావాదేవీలు, విచారణలు, అరెస్టు, జైలు, బెయిల్ తదితర విషయాలన్నిటినీ పక్కనపెడితే, ఏపీలో అధికార పార్టీకి చెందినవారిని కల్వకుంట్ల కవిత బెదిరించి డబ్బు వసూలు చేస్తుంటే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఎందుకు మౌనంగా ఉండిపోయారు?అనే సందేహం కలుగక మానదు.
అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చాలా శక్తివంతుడు కనుక అప్పుడు ఏమీ చేయలేక, ఇప్పుడు కల్వకుంట్ల కవిత భాగోతాలను మీడియా (సాక్షి) ద్వారా బయటపెడుతూ కక్ష తీర్చుకుంటున్నారా? అనే సందేహం కలుగక మానదు.
ఈ కేసులో ఆమెను ప్రశ్నించడానికి 5 రోజులు కస్టడీకి అనుమతించాలని సీబీఐ అభ్యర్ధనపై మరికొద్ది సేపటిలో కోర్టు తీర్పు చెప్పబోతోంది.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…