Telugu

తెరాస తో కేసీఆర్ పోగుట్టుకున్నది కవిత రాబట్టుకుంటుందా.?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనతో తెలంగాణ ప్రజలలో ప్రాంతీయవాదాన్ని పెంచి పోషించిన కేసీఆర్ పార్టీ ఏర్పాటు లక్ష్యం పూర్తి కావడంతో జాతీయ రాజకీయాల మీద శ్రద్ధతో పార్టీ పేరుని తెరాస నుంచి భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) గా రూపాంతరం చేసారు.

దీనితో తెలంగాణ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా పోయింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లకు తోడు బిఆర్ఎస్ కూడా జాతీయ పార్టీగా ఆవిర్భవించడంతో తెలంగాణలో ప్రాంతీయ పార్టీల కొరత ఏర్పడింది. అలాగే కేసీఆర్ తెరాస ను పక్కన పెట్టి బిఆర్ఎస్ తో ముందుకెళ్ళి రాజకీయం మొదలుపెట్టిన తొలి ప్రయత్నంలోనే తెలంగాణ అధికార పీఠాన్ని కోల్పోయారు.

ADVERTISEMENT

2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ తన పదేళ్ల అధికార పీఠానికి శుభం కార్డు వేస్తూ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. ఇక 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అసలు ఖాతానే తెరవేలేకపోయింది.

దీనితో కేసీఆర్ తెరాస పేరు మార్పుతో తన రాజకీయాన్ని మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టనున్నారా అన్న చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కవిత బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకు రావడం ఆమె తన జాగృతి ద్వారా సొంత రాజకీయం చేయడంతో బిఆర్ఎస్ పార్టీకి మరిన్ని రాజకీయ కష్టాలు మొదలయ్యాయి.

ఇక తెలంగాణ రాజకీయాలలోకి కవిత మరోకొత్త పార్టీతో అడుగుపెట్టనున్న సందర్భంలో కవిత చేసిన తాజా ప్రకటన కేసీఆర్ బిఆర్ఎస్ కు మరో రాజకీయ ముప్పును తెచ్చేలా కనిపిస్తుంది. తెరాస బిఆర్ఎస్ గా మరిన క్రమంలో తెరాస పేరు ఇప్పుడు ఖాళీగానే ఉంది, కాబట్టి ఆ పేరును ఎవరు ఎలా అయినా వినియోగించుకోవచ్చు అంటూ ప్రకటించడంతో కవిత కొత్త పార్టీ పేరు తెరాస కానుందా అన్న చర్చ ఊపందుకుంది.

ఒకవేళ అందరి ఊహలకు తగ్గట్టే కవిత తెరాస పేరుతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెడితే తెరాస తో కేసీఆర్ పోగుట్టుకున్నది కవిత రాబట్టుకోగలదా.? పార్టీ పేరుతోనే కవిత కేసీఆర్ ని తొలిదెబ్బ కొట్టనున్నారా.? అన్న కేటీఆర్ కి గుదిబండ కానున్నారా.? బిఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయనున్నారా.?

ఎవరు ఎమన్నా తెలంగాణ ప్రజలకు తెరాస పేరుకి చాల అభినాభావ సంబంధం ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆ బంధమే కవిత రాజకీయానికి పునాది రాళ్లు కానున్నాయా.? తెరాస నుంచి బిఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ తన ప్రాంతీయతత్వాన్ని కోల్పోయి తెలంగాణ ప్రజలకు దూరమయ్యిందా.?

ఇప్పుడు ఆ ప్రాంతీయ భావనే తెలంగాణ ప్రజలకు కవిత పార్టీని దగ్గర చేయనుందా.? కవిత పార్టీ పేరు ఎంపికతోనే తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించనున్నారా.? తెరాస పేరు కవితకు రాజకీయంగా లబ్ది చేకూర్చనుందా.? ఇలా కవిత ఒక్క ప్రకటన ఇన్ని చర్చలకు దారితీస్తుంది. అలాగే ఎన్నో ప్రశ్నలకు జవాబు కోరుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jungle Adventure: Yash Chooses Disaster Director Again?

Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…

25 minutes ago

Pics: Teju Ashwini Makes A Pink Saree Feel So Modern

Teju Ashwini brings a fresh burst of pink to this dreamy indoor photoshoot, and the…

45 minutes ago