
కవిత తన కొత్త పార్టీ పేరును తెరాస గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాలలోకి మరోసారి ‘తెరాస’ ప్రకంపనలు మొదలయ్యాయి. కవిత కొత్త పార్టీ పేరు పై బిఆర్ఎస్ “ఒరిజినల్ ఎప్పటికి ఒరిజినలే” అంటూ తనదైన స్టయిల్ లో స్పందించింది.
ఇక తెలంగాణ రాజకీయాలలో రెండవ స్థానం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న బీజేపీ కూడా తన స్పందన తెలియచేసింది. బీజేపీ ధర్మపురి ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కవిత ను తమ పార్టీ ఎప్పుడో మర్చిపోయిందని, తెలంగాణ రాజకీయాలలో నిన్నటి వరకు ‘పిట్టల దొర’ క్యారెక్టర్ ని చూసాం,
ఇక నేటి నుంచి ‘పిట్టల దొరసాని’ క్యారెక్టర్ చూస్తాం, కవిత తెరాస కూడా కేసీఆర్ బిఆర్ఎస్ లో ఒక భాగమే అంటూ ఎద్దేవా చేసారు. కవిత ఇప్పటికి తెరాస హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకురాలేకపోతున్నారని, దాన్ని దాటి తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎప్పుడో చాల ముందుకెళ్ళిపోయారంటూ వాపోయారు అరవింద్.
తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చిన బీజేపీ ని ఎం చెయ్యలేవంటు టి. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కవిత తెరాస పై తన స్పందనను తెలియచేసారు. ఏదిఏమైనా కవిత కొత్త పార్టీ తెరాస పై ప్రతిపక్ష బిఆర్ఎస్ కంటే అధికార కాంగ్రెస్ కంటే టి. బీజేపీ ఘాటుగా స్పందించారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలోను, పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావం సందర్భంలోను కవిత వారి పార్టీల ఏర్పాటులను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చి కించపరిచే విధంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు కవిత కూడా టి. బీజేపీ నేతల నుంచి అదే రకమైన విమర్శలు (పిట్టల దొరసాని) ఎదుర్కోవడం ఆ దేవుని స్క్రిప్ట్ లో భాగమే అనాలేమో బహుశా..!
“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…
Election commission chief Gyanesh Kumar had been facing a peculiar challenge as the people of…