Telugu

కవిత తెరాస… కేసీఆర్ బిఆర్ఎస్ ని మౌనంలోకి నెట్టిందా.?

కవిత తెరాస కేసీఆర్ బిఆర్ఎస్ నోరు నొక్కేస్తుందా అన్నట్టుగా బిఆర్ఎస్ తన 25 వ ఆవిర్భావ వేడుకలను చాల నిశ్శబ్దంగా జరుపుకుంటుంది. తెరాస పేరుతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన కేసీఆర్ కు అదే తెరాస పేరుతో ఊహించని రాజకీయ షాక్ ఇచ్చారు కవిత.

కవిత తన పార్టీ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ని ఉద్దేశించి ‘మారిన మనిషి – మరమనిషి’ అంటూ సంభోధించిన బిఆర్ఎస్ నుంచి ఆ స్థాయి ప్రతిస్పందన కనిపించలేదు. అటు కవిత పై ప్రత్యారోపణలు చెయ్యలేక ఇటు కవిత విమర్శల పై మౌనం వహించలేక బిఆర్ఎస్ నేతలు కుడితిలో పడ్డ ఎలుకల మాదిరి అల్లాడుతున్నారు.

ADVERTISEMENT

ఇటువంటి సందర్భంలో నేడు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు కేవలం జెండా ఆవిష్కరణతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 25 వసంతాలు పూర్తి చేసుకుని అట్టహాసంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవాల్సిన బిఆర్ఎస్ కవిత తెరాస తో మౌనంలోకి వెళ్లిపోయిందా అన్నది తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిపోయింది.

బిఆర్ఎస్ ఒక పార్టీ కాదు అదొక విప్లవం అంటూ కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇక పోరాటాల పునాదుల మీద పుట్టి ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలలో నాటుకుపోయిన గులాబీ శక్తి బిఆర్ఎస్ అంటూ హరీష్ రావు వాపోయారు.

అయితే పార్టీ అధినేత కేసీఆర్ అంతర్గత సమావేశాలతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేత హరీష్ రావు సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలలో సైతం నైరాశ్యం నిండుకుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

జెర్సీ క్రెడిట్ ఇంకా పనిచేస్తుందా?

“మళ్లీ రావా, జెర్సీ” లాంటి సినిమాలతో కల్ట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. “జెర్సీ”తో…

9 minutes ago

Pic Talk: Jagan Takes Car Ride In London Streets!

The former chief minister of Andhra Pradesh Jagan Mohan Reddy is currently on a foreign…

49 minutes ago