
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో గొడవపడటం, ఆమెను పార్టీని బహిష్కరించడం కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమేనని అనుమానిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ఓటమి, ఫిరాయింపులు, కేసుల కారణంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీన పడింది.
కనుక ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, ముఖ్యంగా… కాంగ్రెస్, బీజేపిలను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ ఈ కొత్త డ్రామా ఆడుతున్నారనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇవి నిజమో కావో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో తేలిపోబోతోంది.
ఒకవేళ వారి గొడవలు నిజమే అయితే… ఒంటరిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆమె, తాను తండ్రి చాటు బిడ్డని కానని, బీఆర్ఎస్ పార్టీ అండదండలు లేకపోయినా రాజకీయాలలో రాణించగలనని నిరూపించుకోవలసి ఉంటుంది. ఇందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆమెకు ఓ చక్కటి అవకాశంగా లభించింది.
కనుక తెలంగాణ జాగృతి తరపున అభ్యర్ధిని బరిలో దించి గెలిపించుకొని కవిత తన సత్తా చాటుకోవచ్చు. అంతేకాదు… బీఆర్ఎస్ పార్టీతో రహస్య అవగాహన ఏమీ లేదని అది తన రాజకీయ శత్రువే అని నిరూపించుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ ఆమె నిలబెట్టిన అభ్యర్ధి ఓడిపోయినా ఆమెకు పెద్దగా నష్టం ఉండదు.
కానీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుస ఓటముల తర్వాత జరుగుబోతున్న ఈ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోతే కేటీఆర్ పరువు పోతుంది. ఆయనకి, బీఆర్ఎస్ పార్టీకి ఉత్తి హడావుడే తప్ప చావ లేదని తేలిపోతుంది.
కానీ ఒకవేళ ఆమె బయటకు వెళ్ళడం కేసీఆర్ వ్యూహంలో భాగమే అయితే ఏదో వంకతో ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ అభ్యర్ధిని బరిలో దించినా ఓట్లు చీల్చి కాంగ్రెస్, బీజేపిలను దెబ్బ కొట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సాయపడవచ్చు.
కనుక బీఆర్ఎస్ పార్టీలో కవితది వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్స్ వంటివా లేదా నిజంగానే తెలంగాణ జాగృతి సపరేట్ స్టోరీయా? అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో తేలిపోతుంది.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…