
తెలంగాణ రాజకీయాలు ఒక పక్క కాంగ్రెస్ vs బిఆర్ఎస్ గా సాగుతుంటే, మరోవైపు కవిత vs బిఆర్ఎస్ అంటూ కదులుతున్నాయి. అయితే ఇక్కడ బావ కళ్ళలో ఆనందం చూడడానికి హరీష్, రేవంత్ సర్కార్ తో పోరాడుతుంటే, అక్కడ బావ కళ్ళలో ఆక్రోశం చూడడానికి కవిత, హరీష్ తో యుద్ధం మొదలుపెట్టింది.
ఇందులో ఎవరి పోరాటాలు ఫలిస్తాయో, ఎవరి యుద్దాలు ఫలితాల్ని అందుకుంటాయో తెలుసుకోవడానికి తెలంగాణ రాజకీయం సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతుంటే, హరీష్ రావు తప్పులను ఎత్తిచూపుతూ కవిత, హరీష్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభలో బిఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రతిపక్ష హోదా స్థాయిలో ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు, నీటి ప్రోజెక్టుల పేరుతో ఏపీ – తెలంగాణ మధ్య రేపుతున్న ప్రాంతీయ చిచ్చు ఇవన్నీ కూడా హరీష్, కేసీఆర్ కళ్ళలో ఆనందం కోసమే చేస్తున్నారనేది సుస్పష్టం.
అకారణంగా ఏపీ నీటి ప్రోజెక్టుల పై అక్రమాలు – అన్యాయాలు అంటూ ఆరోపణలు చేయడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని ఎదుర్కోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ని తెలంగాణ రాజకీయాలలోకి తీసుకురావడం, బిఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడ్డడం, బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించుకోలేక అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించడం వంటి నిర్ణయాలతో హరీష్, కేసీఆర్ కళ్ళలో ఆనందం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే మొన్న బిఆర్ఎస్ కోవర్డ్, కేసీఆర్ కట్ఠప్ప, నిన్న తెలంగాణ చంద్రబాబు, ఇక నేడు బబుల్ షూటర్ అంటూ హరీష్ టార్గెట్ గా కవిత చేస్తున్న విమర్శలు, బంగారు తెలంగాణ అంటే మీ ఇంటిని బంగారం చేసుకోవడం కాదు కదా అంటూ వేస్తున్న ప్రశ్నలు అన్ని కూడా హరీష్ కళ్ళలో ఆక్రోశం చూడడానికే కవిత ఎంచుకున్న రాజకీయ వ్యూహం కావచ్చు.
కాళేశ్వరం లో హరీష్ అవినీతి కేసీఆర్ రాజకీయానికి ఒక మాయని మచ్చని, బిఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి హరీష్ కూడా బాధ్యుడే అని, కల్వకుంట్ల కుటుంబం నుంచి తనకు ఎదురవుతున్న అవమానాలు, బిఆర్ఎస్ పార్టీ నుంచి తాను ఎదుర్కున్న ఎదురుదెబ్బలు అన్నింటిలో హరీష్ పాత్ర ఉందంటూ కవిత చేస్తున్న హంగామా మొత్తం హరీష్ కళ్ళలో ఆక్రోశం నింపే ప్రణాళికలో భాగమే.
అయితే ఈ ఇద్దరు చేస్తున్న ఈ బావల రాజకీయం ప్రత్యక్షంగా, పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎంతో ప్రభావితం చేయనుంది. ఇందులో హరీష్ సక్సెస్ అయితే బిఆర్ఎస్ రాజకీయంగా లబ్ది పొందుతుంది, అలాకాకుండా ఒకవేళ కవిత వ్యూహాలు ఫలిస్తే బిఆర్ఎస్ రాజకీయంగా పతనమవుతుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…