
తెలంగాణ రాజకీయం మొత్తం కాంగ్రెస్, బిఆర్ఎస్ , బీజేపీ పార్టీల రాజకీయాలతో గతుకుల రోడ్డుగా మారిపోయింది. ఆ దారిలో ప్రయాణం చేసి కొత్తగా పార్టీ పెట్టి అధికార పీఠాన్ని అందుకోవడం అంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడమే అవుతుందేమో..!
ఇప్పుడు ఆ శిఖర తీరాలు అందుకోవాలని, వాటి అంచున నిలబడి తన పార్టీ జెండా ఎగరెయ్యాలని కవిత తెగ ఉత్సాహపడుతున్నారు. మరి కవిత ఉత్సాహం ఈ మూడు పార్టీల రాజకీయం మధ్య నలిగి ఆవిరవుతుందా.? లేదా ఈ మూడు పార్టీల రాజకీయాలను తట్టుకుని నిలబడగలుగుతుందా అనేది కాలమే బదులు చెప్పాలి.
అయితే ఫలితం ఎలా ఉన్నా అటు కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలను కాదని, ఇటు బిఆర్ఎస్ అనే ఉద్యమపార్టీని, సొంత తండ్రి పార్టీని వద్దనుకుని జాగృతి పేరు మీద కవిత మొదలు పెడుతున్న ఈ కొత్త ప్రయాణం చాల సాహసంతో కూడుకున్న నిర్ణయమనే చెప్పాలి.
వెళ్ళబోయేది ప్రమాదకరమైన మార్గమే అయినా కవిత వద్ద ఇప్పటి వరకు చిరు దీపం కూడా లేకపోవడం కవిత ప్రయాణం పై అనుమానాలను లేవనెత్తున్తన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు కవిత తెలంగాణ ప్రాంతీయవాదాన్ని మొదలుకుని, ప్రభుత్వ, ప్రతిపక్షాల వైఫల్యాల వరకు ప్రతి అంశంలో తన స్వరం వినిపిస్తు వెళుతుంది.
అలాగే బీజేపీ ని కూడా వదిలేదెలే అన్నట్టుగా ఆ పార్టీ నాయకత్వం మీద కూడా బాణాలు ఎక్కుపెడుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ ముఖ్య నాయకుల మీద ద్రుష్టి పెట్టిన కవిత, హరీష్ టార్గెట్ గా రాజకీయం చేస్తుంది, అవకాశం చిక్కినప్పుడల్లా కేటీఆర్ ని గురి పెడుతుంది.
హరీష్ ని గుంటనక్క తో పోల్చిన కవిత ఈ మధ్యకాలంలో కేటీఆర్ ని ఉద్దేశించి పలు కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీమధ్య సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి అంటూ రేవంత్ సర్కార్ ని డిమాండ్ చేసిన కేటీఆర్ ని ఉద్దేశించి గత పదేళ్లుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉండి,
అప్పుడు ఆ డిమాండ్ తో ఎవరైనా గొంతెత్తితే వారిని అన్యాయంగా అరెస్టు చేసి, ఆ గొంతుని తోక్కేసిన మీరు ఇప్పుడొచ్చి ప్రత్యేక జిల్లా కావాలంటూ డిమాండ్ చేస్తుంటే వినడానికి నవ్వొస్తుంది అంటూ కేటీఆర్ ని హేళన చేస్తూ మాట్లాడారు.
ఇక తాజగా NTV జర్నలిస్టుల అరెస్టు పై కేటీఆర్ స్పందిన విధానం పై విరుచుకుపడ్డారు కవిత. గతంలో కేటీఆర్ పై ఓ ఛానెల్ వార్త రాస్తే మీ కార్యర్తలు అక్కడికి వెళ్లి సదరు ఛానెల్ మీద దాడి చేశారు, దాన్ని మీరు సమర్ధించారు.
కానీ ఇప్పుడు ఓ సాటిలైట్ ఛానెల్ ఒక ఐఏఎస్ స్థాయి మహిళ మీద వార్త రాస్తే ఆ మహిళకు అండగా ఉండాల్సిన మీరు అది వదిలి పెట్టి మహిళలను టార్గెట్ చేసే మీడియా వారికీ మద్దతు తెలుపుతారా.? వారికి అనుకూలంగా ప్రకటనలు చేస్తారా.?
ఇదేనా మీ రాజకీయ నీతి అంటూ కవిత మహిళా సెంట్రిక్ గా కేటీఆర్ చర్యలను తప్పుబట్టారు. అంటే కవిత కేటీఆర్ పై విమర్శనాబాణాలు ఎక్కుపెట్టదానికి సరైన సమయం, అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.
మరి కేటీఆర్ కవిత కు ఆ అవకాశాలను ఇస్తారా.? లేదా కవితే అటువంటి అవకాశాలను వెతికి పెట్టుకుంటారా.? అనేది రానున్న రోజులలో ఇంకాస్త స్పష్టంగా తెలుస్తుంది. ఇలా బిఆర్ఎస్ కేంద్రంగా కవిత చేస్తున్న విమర్శలు ఒక్కో గడప దాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అందులో ఇప్పటికే కవిత హరీష్ ని దాటి కేటీఆర్ వరకు వచ్చారు, మరి ఆ తరువాత కేటీఆర్ ని దాటి కేసీఆర్ వరకు వెళతారా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…