
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ నిన్న నల్గొండ సభలో కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ సింహంలా గర్జించారు. కానీ అదే అంశాలపై శాసనసభలో చర్చలు జరుగుతుంటే, సమావేశాలకు వెళ్ళకుండా మొహం చాటేస్తున్నారు!
కేసీఆర్ శాసనసభకు ఎందుకు రావడం లేదు? ఇక్కడ చర్చలు జరుగుతుంటే రాకుండా ఫామ్‌హౌస్‌లో ఎందుకు పడుకుంటున్నారు?ఆయన గతంలో సచివాలయానికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు శాసనసభకు రావడం లేదు. శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే ఎన్నికలలో ఎందుకు పోటీ చేశారు? తక్షణం మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ స్థానంలో హరీష్ రావుకో మరొకరికో బాధ్యత అప్పగించండి,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ఆక్షేపిస్తున్నారు. అయినా కేసీఆర్ శాసనసభకు వెళ్ళడం లేదు.
ఈ రోజు శాసనసభ సమావేశాలలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “శాసనసభలో తన గురించి అవమానకరమైన భాష మాట్లాడుతున్నారని కేసీఆర్ నల్గొండ సభలో బాధపడ్డారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను “మేడిగడ్డ బ్యారేజిలో ఏం పీకడానికి పోయాడు?” అంటూ ఆయన చులకనగా మాట్లాడటం తప్పు కాదా?
ఇలా అహంకారంతో విర్రవీగినందుకే ఎన్నికలలో ప్రజలు నీ ఫ్యాంట్ ఊడ బీకితే ఫామ్‌హౌస్‌లో బోర్లా పడి ఎముకలు విరగ్గొట్టుకున్నావు. అయినా నీకు అహంకారం తగ్గిన్నట్లు లేదు. ఇలాగే మాట్లాడితే ఈసారి ప్రజలు నీ ఒంటి మీద మిగిలిన ఆ బట్టలను కూడా ఊడ బీకి పంపిస్తారు. జాగ్రత్త!
నిన్ను (కేసీఆర్)ని చంపాల్సిన అవసరం మాకేమిటి? నువ్వో చచ్చిన పామువి. ప్రజలే కర్రతో కొట్టి చంపేశారు. చచ్చిన పాముని మళ్ళీ ఎవరైనా చంపాలనుకుంటున్నారా?
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజిలపై చర్చిద్దామంటే కేసీఆర్ శాసనసభకు రాడు. ఎక్కడో సభ పెట్టి ఇలా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతాడు. మీ నాయకుడికి దమ్ముంటే ఇప్పుడే శాసనసభకు రమ్మనమనండి. ఆయన కోరుకునే ప్రతీ అంశం మీద మేము ఎన్ని గంటలైనా చర్చించడానికి సిద్దంగా ఉన్నాము,” అని సిఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలకు, కేసీఆర్‌కు సవాలు విసిరారు.
ఇదివరకు ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో కేసీఆర్ కూర్చున్న కుర్చీలో ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడుతుంటే, చూసి తట్టుకోలేకనే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రావడం మానుకున్నారని సిఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు.
కేసీఆర్‌కు ‘ఇగో’ చాలా ఎక్కువ. సభకు వస్తే కాంగ్రెస్ మంత్రులు అవమానిస్తారనే భయం, అవమానిస్తే తట్టుకోలేననే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. పైగా ఆయన సభకు వస్తే ‘అవినీతి చిట్టాలు’ వినిపించడానికి సిద్దంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి చెపుతుండటం కూడా కేసీఆర్ సభకు రాకపోవడానికి మరో కారణం అయ్యుండవచ్చు.
కేసీఆర్ ఏ కారణం చేత శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోయినా కాంగ్రెస్ మంత్రులకు ఆయనని విమర్శిచేందుకు ఇంకా ఎక్కువ అవకాశం లభిస్తుంటుంది. ఒకవేళ ఇప్పుడు శాసనసభకు వచ్చినా ‘మా పోరు భరించలేకనే చచ్చిన్నట్లు వచ్చారని,’ కాంగ్రెస్ మంత్రులు దెప్పిపొడవక మానరు.
కారణం ఏదైనప్పటికీ కేసీఆర్ శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా మొహం చాటేస్తూ తన పరువు తానే తీసుకొంటున్నారని చెప్పవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…