జాతీయ రాజకీయాలలోకి వెళ్దాం అనుకుంటే…జాతీయ పార్టీలోకి వెళ్తున్నారా..?

తెరాస గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బిఆర్ఎస్, భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదాం అని ఆశ పడిన పార్టీ అధినేత కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు గట్టి షాకె ఇచ్చారు.

2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన బిఆర్ఎస్ ఇప్పుడు ఒక్కక్క్కొటిగా తన బలాన్ని కోల్పోతూ వస్తుంది. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకులు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ హ్యాండ్ అందుకున్నారు. ఎంపీ లుగా జాతీయ రాజకీయాలలో పాలుపంచుకోవాల్సిన బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒక్కక్కొరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు.

ADVERTISEMENT

పెద్దపల్లి ఎంపీగా ఉన్న బిఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ కాంగ్రెస్ గూటి చేరారు. ఈసారి కూడా కేంద్రంలో మోడీ హావ కొనసాగుతుంది అనే అంచనాలతో మరికొంతమంది బీజేపీ ని ఆశ్రయిస్తున్నారు. అందులో నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బేబీ పాటిల్ కాషాయ కండువా కప్పుకున్నారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు గాను మెదక్ ఎంపీ గా ఉన్న కొత్త ప్రభాకర్ ఎమ్మెల్యే గా బరిలో దిగారు. దీనితో బిఆర్ఎస్ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో ముగ్గురు పార్టీ మారగా, ఒకరు ఎమ్మెల్యే గా రావడంతో బిఆర్ఎస్ ఎంపీ ల సంఖ్య 5 కు చేరింది. ఇక ఎన్నికలు సమీపించే నాటికి ఈ సంఖ్య ఎంత తగ్గవచ్చు అనేది ఊహించలేము.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రజలు పట్టకట్తడం ఆనవాయితీగా వస్తున్నా తరుణంలో ఈ సారి బిఆర్ఎస్ పార్టీకి అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు కేంద్రలో అదిఆకార్ పార్టీగా ఉంటున్న బీజేపీ కలిపి గట్టి దెబ్బ వేయనున్నాయనేది స్పష్టమైంది. ఇన్నాళ్లు అధికారం అనుభవిస్తూ ప్రజలకు దూరమైనా కేసీఆర్ ఇప్పుడు ఓటమి అవమానంతో మరోసారి ప్రజలకు దూరమవుతున్నారు.

ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్న నాయకుడిని కానీ, పార్టీని కానీ ప్రజలు ఎప్పటికి అక్కున చేర్చుకోరు అనేది ఎన్ని సారు రుజువయ్యింది. రాజకీయాలలో గెలుపోటములు సహజం. రెండిని ఒకేలా తీసుకుని రాజకీయాలు చేయగలిగితేనే పార్టీ కి భవిష్యత్తు ఉంటుంది. కేసీఆర్ బయటకు రాకపోయినా కుమారుడు కేటీఆర్, బావమరిది హరీష్ రావు ప్రజలలో ఉండబట్టి
ఈ కొంతమంది నాయకులనైనా నిలబెట్టుకోగలిగింది బిఆర్ఎస్.

మొత్తానికి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలి అనుకున్న కేసీఆర్ కలను బిఆర్ఎస్ నాయకులు జాతీయ పార్టీలలో చేరి నెరవేరుస్తున్నట్టున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

4 minutes ago

The Koffee Ends, The Karan Show Goes On

For years, celebrity gossip, awkward questions and headline-making confessions came with a familiar backdrop: Karan…

20 minutes ago