
అయితే తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఓ ప్రచారం మీడియా వర్గాల్లో ఊపందుకుంది. అది కూడా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని, మోడీ తీసుకున్న నిర్ణయం ఒక దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించారని ప్రచారం జరుగుతోంది. నోట్ల మార్పిడితో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందని, నిత్యావసరాలకు కూడా ప్రజల వద్ద డబ్బులు లేకుండా పోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని కేసీఆర్ పేర్కొన్నట్లుగా జగన్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి.
ముఖ్యంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎందుకు ప్రస్తావించలేదని కేసీఆర్ మండిపడ్డట్లుగా, ఇప్పటికే దేశంలోని వివిధ ముఖ్యమంత్రులు దీనిని వ్యతిరేకిస్తున్నారు గనుక, ప్రధానిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిద్ధామని పార్టీ నేతలతో పేర్కొన్నట్లుగా టాక్. అలాగే సోషల్ మీడియాలో తొలుత మోడీ నిర్ణయానికి బ్రహ్మరధం పట్టినప్పటికీ, రోజురోజుకు పెరుగుతున్న ఇబ్బందులను ఏకరువుపెట్టడాన్ని కూడా స్వయంగా కేసీఆర్ పరిశీలించారని, అన్ని వర్గాలలోనూ మోడీ నిర్ణయం వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
నిజంగా కేసీఆర్ ఇవే వ్యాఖ్యలను చేసి ఉన్నట్లయితే ఎందుకు అధికారికంగా వెల్లడించలేదు? ఇప్పటికే మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి ముఖ్యమంత్రులు మోడీ నిర్ణయాన్ని బహిరంగంగానే విభేదిస్తున్నారు గనుక, వారి స్వరానికి కేసీఆర్ ఎందుకు చేయూతనివ్వలేకపోయారు? అలాగే జగన్ మీడియా మాత్రమే ఈ వ్యాఖ్యలను బలంగా ప్రచారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అన్న రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని విభేదించినట్లయితే ప్రజల్లోని తనపై తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావన తెలంగాణా ముఖ్యమంత్రిలో నెలకొని ఉందా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…