వారానికి అన్ని భాషలు కలుపుకొని కనీసం ఆరేడు సినిమాలు వస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి, మిగతా వాటిని జనాలు కనీసం పట్టించుకోరు. కానీ.. ఈమధ్యకాలంలో టీజర్ & ట్రైలర్ రిలీజ్ నుండే తారాస్థాయిలో హేట్రెడ్ సంపాదించుకొని, రిలీజ్ టైంలో కూడా అదేస్థాయిలో ట్రోల్ అయిన సినిమా “ది కేరళ స్టోరీ 2”.
పార్ట్ 1 ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగా.. పార్ట్ 2 మాత్రం కేరళ రాష్ట్రం అసలు పట్టించుకోలేదు. ఆ ఇండస్ట్రీ వాళ్లు కూడా కేరళ స్టోరీ మీద ఘాటుగానే స్పందించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా పార్ట్ 2 అంత హడావుడి చేయలేకపోయింది. ఓ మోస్తరు థియేట్రికల్ రన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వెర్షన్ తొలుత మే 8న రిలీజ్ కోసం ప్లాన్ చేయగా.. ప్రస్తుతం థియేటర్లలో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయకపోవడంతో ఓటీటీ రిలీజ్ నీ ఒకవారం ముందుకు పుష్ చేసి మే 1న జీ5 యాప్ లో రిలీజ్ చేస్తున్నారు.
ఎలాగు ఓటీటీ రిలీజ్ తర్వాత సినిమా క్లిప్పింగులన్నీ వైరల్ అవుతాయి కాబట్టి, కేరళ ప్రజానీకం ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి.







