ఏబీ వెంకటేశ్వరరావు ఏకాకి అవుతారా?

kesineni nani supports AB Venkateswara Raoచంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ డీజీగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించి అవినీతికి పాల్పడినందుకు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. వివిధ సంస్థలతో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని దానికి ప్రాధమికంగా ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం అంటుంది.

అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని అందుకే ప్రభుత్వం తన మీద కక్ష సాధిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు తన సన్నిహితుల దగ్గర అంటున్నారట. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడం విశేషం.

ADVERTISEMENT

“మీరు సీఎం అవ్వటానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, టీడీపీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే.. సస్పెండ్ చేశారేంటి జగన్‌ గారూ,” అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం పడిపోవడానికి ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని టీడీపీ నాయకుల నుండి క్యాడర్ వరకు అనుకుంటూ ఉంటారు.

అదే విషయం కేశినేని నాని కూడా వ్యంగ్యంగా అంటున్నారు. చంద్రబాబుకి కూడా అదే భావన ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు ఈ విషయంలో ఏకాకి అయిపోయినట్టే. ప్రభుత్వం పై లీగల్ పోరాటానికి ఆయన సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories