“నోటా”పై ఫిర్యాదు… విడుదల అయ్యేనా..?!

kethi reddy complaint-against-nota-movie to election commission-“గీత గోవిందం” వంటి అవాక్కయ్యే సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “నోటా” సినిమా 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఎన్నికల కమీషన్ కు ఓ ఫిర్యాదు వెళ్ళింది. కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి అనే సినీ నిర్మాత రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిసి…

[m9ad]

ADVERTISEMENT

“ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ముఖ్యంగా ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించారని, మొదటగా ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాత రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని’ తెలంగాణా సచివాలయం ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడారు.

ముఖ్యంగా తెలంగాణాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో… ఈ సినిమా ప్రభావం చూపుతుందని, అలాగే శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. మరి ఈ ఫిర్యాదుతో విజయ్ సినిమాకు బ్రేకులు పడతాయేమోనన్న ఆందోళన విజయ్ దేవరకొండ అభిమానుల్లో నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories