కథలో కంటెంట్.. హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.
ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. వేసవిలో సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు ఇప్పటికే చిత్రబృందం చెప్పింది. అయితే తాజాగా సినిమా వాయిదా పడొచ్చు అంటున్నారు. ముందుగా కర్ణాటక లో సినిమా షూటింగ్ జరపాలని అనుకున్నా, అక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల రాయలసీమకు మార్చారు.
దీనితో సినిమా లేట్ అయ్యింది. అది కాకుండా వేసవిలో బాలీవుడ్, టాలీవుడ్ లో చాలా చిత్రాలే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో సినిమాని విడుదల చెయ్యడం అంత మంచిది కాదని అనుకున్నారు. దీనితో సినిమా వాయిదా పడినట్టు వార్తలు అందుతున్నాయి. యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.
కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో “ఒకసారి కేజీఎఫ్ 2 తెర మీద చూశాకా కేజీఎఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది,” యష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.





