సెంటిమెంట్ సీన్ తో ముందుకొచ్చిన చిరంజీవి!

Khaidi No 150 Deleted Scenes 3 - Chiranjeeviసంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన “ఖైదీ నంబర్ 150” సినిమా కోసం షూట్ చేసి, ఎడిటింగ్ లో లేపేసిన సీన్లను అభిమానుల కోసం యూ ట్యూబ్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు కామెడీ సీన్లను విడుదల చేసిన చిత్ర యూనిట్, మూడవదిగా సెంటిమెంట్ సీన్ ను తీసుకువచ్చారు. సెంటిమెంట్ సీన్లలో నటించడం తనకు వెన్నతో పెట్టిన విద్య అని మెగాస్టార్ ఈ సీన్ లో చెప్పకనే చెప్పారు.

శంకర్ పాత్రలో ఉన్న చిరుకు ఊరు నుండి చెల్లెలు, అమ్మ ఫోన్ చేసిన మాట్లాడిన ఈ సీన్ లో సెంటిమెంట్ బాగా పండింది. అయితే సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకుని చిత్ర యూనిట్ బృందం దీనిని కట్ చేసి ఉండవచ్చు. ముఖ్యంగా ఇందులో మహిళ చెప్పిన డైలాగ్స్ కు కళ్ళు చెమర్చే విధంగా చిరు ఇచ్చిన రియాక్షన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై మెగాస్టార్ హంగామా ముగిసినా గానీ, స్మాల్ స్క్రీన్ పై అభిమానులను ఇలా ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories