కెరీర్ కోసం కక్కుర్తి మాటలా?

Kiara advani about casting couchకాస్టింగ్ కౌచ్ విషయంలో సినిమా ఇండస్ట్రీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సినిమా కెరీర్ పూర్తి అయిన వాళ్ళు…ఒక రకంగా అసలు అవకాశాలు లేని..రాని వాళ్ళు దాన్ని భూతద్దంలో చూపిస్తూ కాస్టింగ్ కౌచ్ అనేది మహా పాపం అంటూ, గోల గోల చేస్తూ ఉంటే, మరో పక్క అవకాశాలతో వరుసగా దూసుకుపోతున్న తారలు మాత్రం…సంతూర్ సోప్ యాడ్ లో “నేనా…కొలేజా”? అన్నట్లుగా కాస్టింగ్ కౌచ్? లేదు లేదు అసలు మన ఇండస్ట్రీలో అలాంటిది ఉన్నది అనే తెలీదు అన్నట్లుగా అంటున్నారు.

అయితే ఆ కోవలోకే వచ్చి చేరింది మరో అందాల భామ కైరా అద్వానీ తాజాగా ఆమె వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాస్టింగ్ కౌచ్ పై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తన కెరీర్ లో తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ అనుభవాలు అసలు ఎదురుకాలేదని..కనీసం నా చుట్టూ పక్కల కూడా అలాంటి వాతావరణం లేదు అని..పైగా అది ఇండస్ట్రీ సమస్య కాదు అని, ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగతం అంటూ రామాయణ-భాగవతంలో నీతిని వివరించింది.

ADVERTISEMENT

అయితే చేతిలో నాలుగు సినిమాలు ఉండగా…కెరీర్ సాఫీగా సాగిపోతున్నంత కాలం…ఈ ఇబ్బందులు ఏమి ఉండవ్..ఒక్కసారిగా ఆఫర్స్ తగ్గినా…ఎక్కువకాలం ఆఫర్స్ లేకపోయినా అప్పుడు కాస్టింగ్ కౌచ్, మీతో అంటూ అసలు రంగులు బయటకు తీస్తారు తారలు. ఏది ఏమైనా కాస్టింగ్ కౌచ్ కి సత్వర పరిష్కారం చూపక పోతే..ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో.

ADVERTISEMENT
Latest Stories