ప్రభాస్ ను సీక్రెట్ గా డీల్ చేస్తోన్న బాలీవుడ్ భామ!

Kiara Advani - Prabhas Bollywood Gossips‘బాహుబలి’ సినిమాతో జాతీయ, అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చుకున్న ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్, తాజాగా విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’తో మరో మెట్టు ఎదగబోతున్నాడన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ‘బాహుబలి’తో ఎక్కువ క్రెడిట్ రాజమౌళికి వెళ్ళగా, ఆ తర్వాత స్థానాలలో రానా, సత్యరాజ్, రమ్యకృష్ణలకు వెళ్ళింది. కానీ, ‘బాహుబలి 2’లో అందరి కంటే ముందుగా ప్రభాస్ హైలైట్ కానున్నాడన్న టాక్ వినపడుతోంది.

దీనికి తాజా ఉదాహరణగా ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ చేసిన ‘సీక్రెట్’ వ్యవహారం గురించి సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. పెరిగిన క్రేజ్ తో ప్రభాస్ ఇండస్ట్రీలో హాట్ హీరోగా మారారని, దీంతో ప్రభాస్ ను కలవాలని ‘ధోని’ ఫేం కైరా తెగ ప్రయత్నాలు చేసిందని, కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యిందని, ఎట్టకేలకు ఓ టాలీవుడ్ హీరో ద్వారా ప్రభాస్ నెంబర్ సేకరించి, ఓ సందేశం పంపించిందట. ప్రభాస్ కూడా దీనికి ప్రతిస్పందించినట్లుగా చెప్తున్నప్పటికీ, కైరా పెట్టిన ఆ సందేశం ఏమిటన్నది మాత్రం బయటకు రాలేదు.

ADVERTISEMENT

అయితే ప్రభాస్ సరసన కలిసి నటించేందుకు కైరా ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే ఈ సీక్రెట్ సందేశాలు వచ్చి వెళ్లాయని, సహజంగా సెలబ్రిటీల మీద ఉండే ఉత్సుకతతో సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వీటి పర్యవసానాలు ఏమిటన్నది ‘యంగ్ రెబల్ స్టార్’ నటించబోయే తదుపరి సినిమాలలో తెలియనుంది. ఏది ఏమైతేనేం… ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిందన్నది మాత్రం ఈ సందర్భంగా స్పష్టమైన అసలు విషయం.

ADVERTISEMENT
Latest Stories