Telugu

బొమ్మలతో ఆడుకోవాల్సిన చిన్నారుల చేతుల్లో మొబైల్స్… నాట్ గుడ్!

ఈరోజుల్లో చాలా మంది చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. తల్లితండ్రులు వారి కోసం తగినంత సమయం కేటాయించలేకపోవడం, పని ఒత్తిళ్ళు ఇంకా అనేక ఇతర కారణాల వలన వారే తమ పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు పెడుతున్నారు. పెద్దవారే వాటికి అడిక్ట్ అవుతున్నప్పుడు చిన్న పిల్లలు కాకుండా ఉంటారా?

మొబైల్ ఫోన్ల తర్వాత స్టెప్ సోషల్ మీడియా! దీని ప్రభావం నుంచి పెద్దవారే బయటపడలేకపోతున్నప్పుడు చిన్న పిల్లల పరిస్థితి ఏమిటి? అని తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఆలోచించాలి.

ADVERTISEMENT

అలా ఆలోచిస్తున్నవారు చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచుతున్నారు లేదా పరిమిత సమయంలో మొబైల్ ఫోన్‌కి యాక్సస్ ఇస్తున్నారు. కానీ అత్యధికశాతం తల్లితండ్రులు పిల్లల అల్లరి భరించలేకనో లేదా వారి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకో పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు పెడుతున్నారు.

అలా మొబైల్ ఫోన్లతో పరిచయం కాస్త ప్రేమగా, అడిక్షన్‌గా మారి చివరికి వారిని సోషల్ మీడియాలోకి తీసుకుపోతోంది. మొబైల్ వ్యసనమే ప్రమాదమనుకుంటే, తెలిసీ తెలియని వయసులో సోషల్ మీడియాలోకి ప్రవేశించడం ఇంకా ప్రమాదకరం.

కనుక తల్లితండ్రులే జాగ్రత్త పడాలి. కానీ సాధ్యపడటం లేదు కనుక మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకొని చిన్న పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు.

మంత్రులు, సంబంధిత శాఖల అధికారులు, సోషల్ మీడియాలో నిపుణులతో నిన్న ఉండవల్లిలో సమావేశమై దీనిని ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, అలాగే దీని కోసం విధివిధానాలు రూపొందించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహనా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిద్దామని, వీటికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయని మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

కానీ మొబైల్ ఫోన్లు, వాటిలో ఇంటర్నెట్ చిన్న పిల్లలకు అందుబాటులో ఉంటున్నప్పుడు సోషల్ మీడియాలో ప్రవేశించకుండా అడ్డుకోవడం చాలా కష్టమే. కనుక దీని కోసం ఎటువంటి విధివిధానాలు రూపొందిస్తారో, చిన్న పిల్లలను గుర్తించి అడ్డుకునేందుకు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారనేది చాలా ఆసక్తికరం.

కానీ ఇలాంటి మంచి ఆలోచన చేస్తున్నందుకు మంత్రి నారా లోకేష్‌ని ఆయన టీమ్‌ని తప్పక అభినందించాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

8 minutes ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

11 minutes ago