బూతులు తిడితే చంద్రబాబు బతికి ఉంటారా? అంటున్న వైకాపా మంత్రి

Kodali Nani abusive Press Meet after a long gapబూతులకు పెట్టిన పేరు మంత్రి కొడాలి నాని…. ఆయన మరో సారి మీడియా ముందుకు వచ్చి తన ప్రతిభాపాటవాలు చూపించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడిలా 70 రోజుల పాటు..ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఎవరూ లేరన్నారు. తనకు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అని, చంద్రబాబు ఎవడు పనికిరానివాడని చెప్పుకొచ్చారు.

“నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎన్టీ రామారావు…. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది హరికృష్ణ… సీటు ఇప్పించింది జూనియర్ ఎన్టీఆర్,” అన్నారు నాని. “నాకు చంద్రబాబు కానీ కర్జురా నాయుడు కానీ వాళ్ళ నాన్న లవంగం నాయుడు చేసింది ఏం లేదు,” అంటూ విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT

చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని అన్నారు. జోలె పట్టుకుని అడుక్కుతినే బ్యాచ్‌ మీదని.. తమది కాదన్నారు. తనను బూతుల మంత్రి అని అంటున్నారని, తాను బూతులు తిడితే దేవినేని ఉమ, చంద్రబాబు బతికి ఉంటారా? అని అన్నారు.

మొత్తానికి పౌర సరఫరాల శాఖా మంత్రి తనను మించి ఎవరూ ఎక్కువగా బూతులు మాట్లాడలేరు అన్నట్టు చెప్పుకోవడం, దానిని కొందరు పార్టీ అభిమానులు మాస్ లీడర్ లక్షణం అంటూ ఆకాశానికి ఎత్తడం విశేషం. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటంలో పోటీ పడటం ప్రజల దౌర్బాగ్యం అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories