
ఎంకీ పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనట్టు వంగవీటి రాధా పెళ్లి కొడాలి నాని, వల్లభనేని వంశీల ట్రోలింగ్ లకు కారణమైంది. మీడియా ముందుకు వచ్చింది మొదలు బూతులతో, అసభ్యపదజాలంతో ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలలో ఎంత అసహనాన్ని సృష్టిస్తున్నాయి కళ్లారా వీక్షించారు సదరు వైసీపీ నేతలు.
వంగవీటి రాధా వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరైన సమయంలోనే కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా అక్కడకు విచ్చేసారు. అయితే అక్కడికి పవన్ రాగానే జనం ఆయనను చూడడానికి ఎగబడ్డారు. ఆ సమయంలో అదే వేదిక మీద ఉన్న ఈ ఇద్దరు వైసీపీ నేతలను ఒక్కసారిగా వెనకెక్కి నెట్టి మరి పవన్ ను చూసేందుకు జనం ఆసక్తి చూపారు.
ఆ ఆక్రమంలోనే పవన్ అభిమానుల,సెక్యూరిటీల తోపులాటలో వల్లభనేని వంశీ వేదిక మీద నుండి క్రిందకు నెట్టివేయబడ్డారు. ఆ తోపులాటలో నిలబడలేక నాని వేదిక నుండి వెనక్కు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ స్టామినా ఏమిటో కళ్లారా చూసారా! అంటూ సదరు వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు.
ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ ను కించపరిచే వైసీపీ అధినేత జగన్ మొదలు ప్రతి వైసీపీ నేత ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది ప్రజలలో పవన్ స్థాయి,స్తానం ఏమిటో అంటూ జనసైనికులు వైసీపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా టీడీపీ అభిమానులు కూడా ఇదే వీడియోతో కొడాలి నానిని, వల్లభనేని వంశీ కి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మీకు “ముందుంది మొసళ్ళ పండుగా” అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఎరక్కపోయి వచ్చి పవన్ ముందు ఇరుక్కుపోయారు కొడాలి, వల్లభనేని.
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…