కోహ్లి ఖాతాలో మరో సచిన్ రికార్డ్!

Virat-kohli-breaks-sachin-tendulkar-records-పిచ్ లతో నిమిత్తం లేకుండా పరుగులను అవలీలగా చేస్తాడని ఖ్యాతి గడించిన టీమిండియా సారధి విరాట్ కోహ్లీ, సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా, ఆ రికార్డు ఇప్పటివరకూ సచిన్ టెండూల్కర్ పేరుతో లిఖించబడి ఉండగా, తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ బ్రేక్ చేసాడు. సచిన్ 19 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేయగా, కోహ్లీ దాన్ని 17 ఇన్నింగ్స్ ల్లోనే అందుకుని సరికొత్త రికార్డును అందుకున్నాడు.

ఇక వరల్డ్ క్రికెటర్స్ జాబితాను పరిసీలిస్తే… కోహ్లీ కన్నా ముందు గ్యారీ సోబర్స్ (13), అలిస్టర్ కుక్ (14), బాబ్ సింప్సన్ (16)లు ముందున్నారు. ఇటీవలే ఛేజింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా సచిన్ రికార్డును విరాట్ అధిగమించిన సంగతి తెలిసిందే. 232 ఇన్నింగ్స్ లు ఆడిన సచిన్ ఛేజింగ్ లో 17 సెంచరీలు సాధించగా, 102 వన్డేల్లోనే కోహ్లీ 18వ శతకాన్ని కూడా పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో 50కి పైగా సగటును కలిగి వున్న ఏకైక క్రికెటర్ కూడా కోహ్లీ నామధేయం నిలిచింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories