RRR లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ మూవీ తరువాత రాబోతున్న జూ. ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రెండు కూడా చాలాకాలంగా వారి ఫాన్స్ ను ఊరిస్తూనే వస్తున్నాయి. చిరు ఆచార్య లో వెండి తెర మీద రామ్ చరణ్ కనిపించినప్పటికీ అది గెస్ట్
పాత్ర కావడం దానికి తోడు ఆచార్య డిసాస్టర్ టాక్ తెచ్చోకోవడంతో చరణ్ ఫాన్స్ ఆశల్ని గేమ్ ఛేంజర్ పైనే పెట్టుకున్నారు.
అలాగే ఆచార్యతో తన కెరీర్ లో మొట్ట మొదటి డిసాస్టర్ అందుకున్న కొరటాల ఈసారి కొట్టేది పాన్ ఇండియా స్థాయిలో మోతమోగించాలి అనే ఉద్దేశంతో చాలా టైం తీసుకుని మరి దేవర షూట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవర నుండి విడుదలైన ప్రతి అప్ డేట్ కూడా సోషల్ మీడియాలో నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతుంది.
Also Read – జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ Vs మెగా ఫాన్స్ – ఎవరికి ఉపయోగం??
దేవర నుండి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ సాంగ్ నుండి ఆ తరువాత వచ్చిన ‘చుట్టమల్లే’, రీసెంట్ గా వచ్చిన ‘దావూదీ’ వరకు మిలియన్స్ లో వ్యూస్ దక్కించుకుని సోషల్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంటూ అటు ఇన్ స్టా రీల్స్ తో, ఇటు యు ట్యూబ్ షార్ట్స్ తో రికార్డుల మోత మోగిస్తున్నాయి.
సెప్టెంబర్ 27 న దేవర విజృంభణకు గెట్ రెడీ అంటూ కొరటాల తారక్ ఫాన్స్ ను ఊపెక్కిస్తుంటే గేమ్ ఛేంజెర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న చరణ్ ఫాన్స్ ను స్లో చేస్తున్నారు శంకర్. గేమ్ ఛేంజెర్ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ జరగండి…జరగండి ప్రేక్షకులకు చాల దూరం జరిగింది.
Also Read – నేతి బీరకాయలో నెయ్యి… పాన్ ఇండియా మూవీలో తెలుగు!
ఇక వినాయకచవితి రోజు ఈ మూవీ నుండి రెండో సాంగ్ విడుదల అంటూ చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ ఆ సాంగ్ విడుదలకు విజ్ఞాలు ఇంకా తొలిగిపోలేదని దానికి బదులుగా 2 nd సింగిల్ థిస్ సెప్టెంబర్ అంటూ చరణ్ పోస్టర్ ను విడుదల చేసారు. భారతీయుడు 2 డిసాస్టర్ కావడంతో శంకర్ మీద మెల్లిమెల్లిగా ఆశలు వదులుకుంటున్నారు చరణ్ ఫాన్స్.
అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన చరణ్ పోస్టర్ లో తలకి ఎర్రతువాల్ తో చరణ్ చాల స్టైలిష్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ చిత్రం రాజకీయ నేపథ్యం తో కూడుకొవడం, చరణ్ జనసేన బ్రాండ్ గా చెప్పుకునే ఎర్ర తువాల్ ను ధరించడంతో పరోక్షంగా ఈ చిత్రం జనసేనకు, పవన్ కు సన్నిహితముగా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read – దువ్వాడకి జగన్ అవసరం లేదా మాధురీ మేడమ్?
విడుదలకు ముందే దేవర తారక్ ఫాన్స్ కు మంచి కిక్కెక్కిస్తుంటే, గేమ్ ఛేంజెర్ మాత్రం అప్ డేట్స్ విడుదల కోసం చరణ్ ఫాన్స్ ను వేచి చూసేలా చేస్తుంది. థిస్ సెప్టెంబర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర ఆన్ డ్యూటీ అంటూ తారక్, జాన్వీ సిద్ధమవుతుంటే, థిస్ సెప్టెంబర్ సెకండ్ సింగిల్ గెట్ రెడీ అంటూ చరణ్, కీయా అద్వానీ రెడీ అయ్యారు.