
‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ వంటి హ్యాట్రిక్ సక్సెస్ లో ఉన్న కొరటాల వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో విలువ పెరిగింది. తన తదుపరి సినిమా కధను ఇప్పటికే మహేష్ బాబుకు చెప్పానని, ఇద్దరికీ బాగా నచ్చిందని, మళ్ళీ సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నానని, ఒక ఎమోషనల్ కధగా తెరకెక్కనుందని తెలిపారు. తన టార్గెట్ 10 బ్లాక్ బస్టర్ విజయాలను అందివ్వడమని, మూడు వరకు ఎక్కడా తప్పటడుగులు పడలేదని అన్న కొరటాల, తన చేతిలో ఇంకా 7 కధలు ఉన్నాయని, అందరి హీరోలతో సినిమాలు తీయాలన్నది తన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు.
రచయితగా పని చేసిన రోజుల్లో చాలా సినిమాలకు తన పేరు వేయలేదని, అందులో ‘సింహా’ సినిమా కూడా ఉందని, కధ, మాటలు తనవి అయితే, దానికి బదులు మరో స్థానంలో తన పేరు వేస్తానని చెప్పడం, తానూ కోపంతో అది కూడా వద్దని చెప్తే, వాళ్ళు చింతించాల్సింది పోయి, హమ్మయ్య అనుకుని, మొత్తానికే అది కూడా తీసేసేవారని తన గత అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతగా రగిలిపోయాడు కాబట్టే… వరుస బ్లాక్ బస్టర్లను తీస్తూ… టాలీవుడ్ టాప్ దర్శకుడిగా మారాడు కొరటాల.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…